సాక్షిత : గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వరద ముంపు ప్రాంతాలైన 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని గోదావరి హోమ్స్ మరియు 125 గాజులరామారం డివిజన్ పరిధిలోని బాలాజీ లేఔట్, ప్రెస్టీన్ ప్యాలెస్, వొక్షిత్ ఎనక్లేవ్ లలో ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ అధికారులతో కలిసి పర్యటించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న రోజుల్లో భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అధికారులు అందరు అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వరద నీరు నిలవకుండా చూడాలని, భారీ వర్షాలను సైతం ఎదుర్కొనేందుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసుకుని సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎటువంటి సమస్యలు ఉన్న అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో GHMC అధికారులు ఈ.ఈ. కృష్ణ చైతన్య, డి.ఈ.ఈ. లు భాను చందర్, రూప దేవి, ఏ.ఈ. లు సురేందర్ నాయక్, కళ్యాణ్, స్థానిక బిఆర్ఎస్ నాయకులు, కాలనీ సంక్షేమ సంఘం నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.