MLA KP Vivekanand unveiled the statue of Swami Vivekananda
స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ 128 డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ లో స్వామి వివేకానంద 160వ జయంతి సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహాన్ని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. అనంతరం ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి యువతరం స్వామి వివేకానందని స్ఫూర్తిగా తీసుకోవాలని భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ తంగ లక్ష్మారెడ్డి, సీనియర్ నాయకులు మహ్మద్ మక్సూద్ అలీ, డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్,
రుద్ర అశోక్, పోలే శ్రీకాంత్, సీనియర్ నాయకులు ఎత్తరి మారయ్య, బస్వరాజ్, వెంకటేష్ గౌడ్, శేఖర్ రావు, ప్రభాకర్ గుప్త, చెల్మా రెడ్డి, మహిళా అధ్యక్షురాలు స్వప్న, నాయకురాలు విజయ లక్ష్మి, కాలనీ ప్రెసిడెంట్ చందు, జెనరల్ సెక్రెటరీ పాల యాదగిరి, ట్రెజరర్ సంతోష్, సురేష్, రాజేందర్, రవి శంకర్ తదితరులు పాల్గొన్నారు.