జర్నలిస్టు కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…
క్యాన్సర్ తో బాధపడుతుండగా.. విషయం తెలుసుకొని తన వంతుగా రూ.1 లక్ష ఆర్థిక సాయం…*
కృతజ్ఞతలు తెలిపిన జర్నలిస్టు కుటుంబం.. జర్నలిస్టు సంఘాలు…
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జగద్గిరిగుట్టకు చెందిన వార్తా జర్నలిస్టు విఠల్ భార్య క్యాన్సర్ తో బాధపడుతున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్ వారికి అండగా నిలిచారు. మానవతాదృక్పథంతో స్పందించి ఎమ్మెల్యే తన తరపున తక్షణ సహాయం కింద రూ.1 లక్ష ఆర్థిక సాయాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పంపి విఠల్ కి ఆయన నివాసం వద్ద అందజేశారు. ఈ సందర్భంగా వారు కుటుంబాన్ని పరామర్శించారు.
ఈ మేరకు విఠల్ , జర్నలిస్టు సంఘాలు ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ దూదిమెట్ల సోమేష్ యాదవ్, జగద్గిరిగుట్ట డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రుద్ర అశోక్, సూరారం డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్, సుభాష్ నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పోలే శ్రీకాంత్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ రషీద్, ఎత్తరి మారయ్య, జర్నలిస్టు యూనియన్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు గడ్డమిది బాలరాజు, కుత్బుల్లాపూర్ వార్త జోన్ ఇంఛార్జి నాగేంద్ర చారి, ఇందిరా గౌడ్, మెట్ల శ్రీనివాస్, వివేక్, హనుమంత్, బండ మహేందర్, శశిధర్, నర్సింగ్ రావు, రత్నేశ్వర్ రావు, ప్రభాకర్, దాసు, వెంకటేష్, సురేందర్, అప్పారెడ్డి, ఈశ్వర్, మహంకాళి, చందు తదితరులు పాల్గొన్నారు.