సమస్యల పరిష్కారంలో ఎల్లవేళలా ముందుంటా : ఎమ్మెల్యే కేపి వివేకానంద్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొంపల్లి 10వ వార్డు శ్వేత శుభం అపార్ట్మెంట్స్ లో వరద నీటి సమస్య, ప్లే ఏరియా మరియు బిల్డర్ ద్వారా పెండింగ్ లో ఉన్న వివిధ సమస్యలపై ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు స్థానిక చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ గారితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అపార్ట్మెంట్ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే గారికి వివరించి.. తమకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని కోరగా.. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గారు అందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ తాల్ల కృష్ణవేణి వినోద్ మరియు నాయకులు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.