విశిష్ట కలిగిన శ్రీ విజయ దుర్గ అమ్మవారిని దర్శించుకోవడం సంతోషకరం….
-అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజానీకం, సీఎం జగన్,తమపై ఉండాలి…..
గుడివాడ పట్టణం నిలామహల్ రోడ్డులో వేంచేసియున్న శ్రీ విజయ దుర్గ అమ్మవారి దేవస్థాన కాలక్షేప మండప ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. 18 లక్షల దాతల సహకారంతో నిర్మించిన మండపాన్ని ఎమ్మెల్యే కొడాలి నాని ప్రారంభించారు. తొలుత ధర్మకర్తల కమిటీ సభ్యులు, దేవదాయ శాఖ అధికారులు మేళతాళాల మధ్య ఎమ్మెల్యే కొడాలి నానికు గౌరవ స్వాగతం పలికారు.అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నానికు, వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందజేసి దేవస్థాన సాంప్రదాయం ప్రకారం సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ. ఎంతో విశిష్టత కలిగిన శ్రీ విజయ దుర్గ అమ్మవారి దేవస్థానంలో, కాలక్షేప మండపాన్ని ప్రారంభించడం తన అదృష్టమని, ఎమ్మెల్యే కొడాలి నాని హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వనిధులు, మరియు భక్తుల సహకారంతో మునుపేన్నడు లేని విధంగా గుడివాడ నియోజకవర్గంలోని దేవాలయాలు భక్తుల్లో ఆధ్యాత్మిక చింతనలు పెంపొందించేలా అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు.
మండప నిర్మాణం పూర్తి కావడానికి అన్ని విధాలుగా సహకరించిన భక్తులు మరియు దాతలకు దేవస్థాన ధర్మకర్తల కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలియచేశారు.మండప ప్రారంభోత్సవ వేడుకల్లో వైసిపి నాయకులు పాలేటి చంటి,ఎంవి నారాయణరెడ్డి, వైసీపీ యువజన విబాగ జిల్లా అధ్యక్షుడు మెరుగుమాల ఖాళీ, గొంగాడ హరిబాబు,జొగా సూర్యప్రకాశరావు,సింగిరెడ్డి గగారిన్,వంగపండు బ్రహ్మాజీ,గిరి బాబాయ్,డాక్టర్ ఆర్కే,ఘంటా చంద్రశేఖర్,రమణ కుమార్, రవి స్వీట్ మోహన్, పంచకర్ల వెంకట్,చందరాల హరిరాంబాబు, చింతల బస్కరరావు,దారం నరసింహారావు, రావులకొల్లు మల్లేశ్వరరావు, సిద్దాబత్తుల నీలవేణి, జూనియర్ జమదగ్ని, మాజీ కౌన్సిలర్ గోకర కొండ బలరాం,దేవస్థాన ధర్మకర్తల కమిటీ చైర్మన్ నైనవరపు శేషుబాబు, ధర్మకర్తల కమిటీ సభ్యులు గొంగాడ మీనాక్షి, ఆర్. సరళ, కుమారి, పావులూరి పద్మావతి, మాది అప్పారావు, లక్ష్మణ కుమార్, నాగేశ్వర రావు, అర్చకులు లంకా పునీత్ శర్మ, ఈవో గంగు శిరీష, భక్తులు పాల్గొన్నారు.