ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 11వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి …..
ప్రతీ విద్యార్థికి చదువుతో పాటు నైపుణ్యం కూడా ఉండాలని అప్పుడే ఏ రంగంలో అయిన రాణించగలమని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.
ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాలలోని డిల్లీ పబ్లిక్ స్కూల్ వరంగల్ 11వ వార్షికోత్సవానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా విద్యార్థులు, పాఠశాల యాజమాన్యం ఎమ్మెల్యే కి ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మెరుగైన విద్య అందించాలని 10ఏళ్ల క్రితం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ను ప్రారంభించారాని ఈ సందర్బంగా ఢిల్లీ పబ్లిక్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలో అత్యున్నత స్థానాలలో భారతీయులే ఉన్నారని చదువుతో పాటు నైపుణ్యం ఉంటే ఏ రంగంలో అయిన రాణించవచ్చని తెలిపారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75ఏళ్ళు గడిచిన విద్య, వైద్య రంగాలలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రంగాలలో అభివృద్ధి జరగాలంటే పెట్టుబడులు పెట్టాలని ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ కేటాయింపులు చేయడం లేదని అన్నారు. నాణ్యమైన విద్య అందుబాటులో లేకపోవడంతో నేడు విద్యను కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. దేశంలో విద్య పరంగా అసమానతలు ఏర్పడడం వల్ల అందరికీ ఒకే రకమైన విద్య అందడం లేదని వెల్లడించారు. ప్రాథమిక పాఠశాలలో చదివే విద్యార్థి కార్పొరేట్ పాఠశాలలో చదివే విద్యార్ధితో పోటీ పడలేక పోతున్నారని నాణ్యమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడంలో విఫలం అవుతున్నామని పేర్కొన్నారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని కోరారు. విద్యతోనే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. భవితరాలు ప్రపంచంతో పోటీ పడాలంటే ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యను అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాకతీయ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్గోపాల్ రెడ్డి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ రాజీ రెడ్డి, వైస్ చైర్మన్ రవి కిరణ్ రెడ్డి, ప్రిన్సిపాల్ ఇన్నారెడ్డి, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.