హైదరాబాద్: కాంగ్రెస్ ఆహ్వానం మేరకు తాను, తన కుమార్తె కావ్య ఆ పార్టీలో చేరామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి.. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘వ్యవస్థలను అపహాస్యం చేసే విధంగా కేంద్రం వ్యవహరిస్తోంది. సీబీఐ, ఈడీ కేసుల్లో ప్రతిపక్ష పార్టీ నేతలను ఇరికిస్తున్నారు. వారు భాజపాలో చేరగానే పునీతులవుతున్నారు. భాజపా ఆగడాలు అడ్డుకునేందుకు కాంగ్రెస్లో చేరాను. ప్రతిపక్షంలో ఉంటే నియోజకవర్గ సమస్యలు పరిష్కరించలేం. భారాసలో నాకు కేసీఆర్ ఎన్నో అవకాశాలు ఇచ్చారు. చాలా మంది ఆ పార్టీని వీడినా.. నన్నే ఎక్కువగా టార్గెట్ చేశారు. మనవరాలి వయసున్న అమ్మాయి చేతిలో ఎర్రబెల్లి ఓటమి సిగ్గుచేటు. పల్లా రాజేశ్వర్రెడ్డి.. భారాసకు చీడపురుగులా మారారు. నేను అవకాశ వాదిని కాదు.. అవకాశాలే నావద్దకు వచ్చాయి. నన్ను రాజీనామా చేయాలని అడిగే హక్కు భారాస నేతలకు లేదు’’ అని కడియం అన్నారు. భారాసను కడియం శ్రీహరి, కావ్య వీడి కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. అనంతరం వరంగల్ లోక్సభ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కడియం కావ్యకు కేటాయించింది.
కాంగ్రెస్ ఆహ్వానం మేరకు తాను, తన కుమార్తె కావ్య ఆ పార్టీలో చేరామని ఎమ్మెల్యే కడియం
Related Posts
సూర్యాపేట లో నూతన డీఎస్పీ కార్యాలయం ప్రారంభం
SAKSHITHA NEWS సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : సూర్యాపేట జిల్లా కేంద్రంలో డీఎస్పీ కార్యాలయాన్ని ఐజి రమేష్ రెడ్డి ఐపీఎస్, IG సత్యనారాయణ ఐపీఎస్, జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్ ఐఏఎస్, జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్…
కబడ్డిలో రాష్ట స్థాయికి ఎంపిక అయిన తిరుమలపూర్ విద్యార్థి
SAKSHITHA NEWS కబడ్డిలో రాష్ట స్థాయికి ఎంపిక అయిన తిరుమలపూర్ విద్యార్థి కొడిమ్యాల: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం లోనితిర్మలాపూర్ ఉన్నత పాఠశాలకు చెందిన బోయిని శివమని ఉమ్మడి కరీం నగర్ జిల్లా స్థాయి అండర్ 14 కబడ్డీ పోటీ లో…