మోహన్ రెడ్డి మరణం పట్ల ఎమ్మెల్యే జిఎంఆర్ తీవ్ర సంతాపం
బి ఆర్ ఎస్ పార్టీకి తీరని లోటు
పటాన్చెరు
బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెన్నవరం మోహన్ రెడ్డి అకాల మరణం పార్టీకి తీరని లోటని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.
రామచంద్రపురం పట్టణానికి చెందిన మోహన్ రెడ్డి తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్ హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి, పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటూ పార్టీ విజయానికి అహర్నిశలు కృషి చేస్తున్న మోహన్ రెడ్డి మరణం తీవ్రంగా కలిచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.