కోనాయపాలెం గ్రామంలో నూతన గ్రామ సచివాలయ భవనాన్ని – విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాన్ని ప్రారంభించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..
రూ.40 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా గ్రామ సచివాలయ భవన నిర్మాణం – రూ.17.5 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా విలేజ్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణం ..
సచివాలయాలతో ప్రజల ముంగిటకు పాలన : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..
వైయస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ లలో 12 రకాల వైద్య సేవలు ..
చందర్లపాడు మండలంలోని కోనాయపాలెం గ్రామంలో NREGs నిధులు రూ. 40 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని, రూ.17.5 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన వైయస్ఆర్ వెల్ నెస్ సెంటర్ భవనాన్ని శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ప్రారంభించారు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల ముంగిటకు పాలన తీసుకోవచ్చారని తెలిపారు. అర్హత కలిగిన వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన పథకాలను చేజారకుండా చూసేందుకు వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి అన్ని రకాల సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వంలో ఏ రకమైన సర్టిఫికెట్ లు కావాలన్నా – సంక్షేమ పథకాలు పొందాలన్నా జన్మభూమి కమిటీలు, మండల కేంద్రాలకు వెళ్లి అధికారుల చుట్టూ తిరగాల్సి వచ్చేదని.. కానీ నేడు ఇబ్బందులు లేకుండా ఆ గ్రామంలోనే 600 రకాల ప్రభుత్వ సేవలు అందేలా గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.
ప్రజల మనసెరిగి పాలన చేస్తూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థల ఏర్పాటుతో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ.. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు గ్రామంలోనే వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ప్రతి 2,500 జనాభాకు ఒక వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని.. దీంతో చిన్న చిన్న జబ్బులకు కూడా 10 కిలోమీటర్ల దూరంలో ఉండే పీహెచ్‌సీకి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు ..
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు ..