SAKSHITHA NEWS

ఎత్తిపోతల పథకం నూతన కమిటీని అభినందించి, శుభాకాంక్షలు తెలిపిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

NTR జిల్లా / వీరులపాడు మండలం :

వీరులపాడు మండలంలోని వి.అన్నవరం గ్రామంలో ఎత్తిపోతల పథకం యొక్క పంప్ హౌస్ కు నూతనంగా ఏర్పాటు చేసిన మోటార్లను ప్రారంభించిన శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు పంట భూములకు నీటిని విడుదల చేశారు .. ముందుగా ఎత్తిపోతల పథకం నూతన కమిటీ చైర్మన్ గా ఎంపికైన వల్లాపూరి నవీన్ కుమార్, వైస్ చైర్మన్ బోయపాటి సుబ్బారావు లను అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు ..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనులు కొనసాగిస్తున్నారని, రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం వాటి పనితీరుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. వీ.అన్నవరం గ్రామ ఎత్తిపోతల పథకం యొక్క మోటార్లు పాడైపోవడంతో పంట పొలాలకు సక్రమంగా నీరు అందక రైతులు ఇబ్బంది పడ్డారని.. నేడు మోటార్లకు మరమ్మత్తులు చేయించి వినియోగంలోకి తీసుకువచ్చామన్నారు. ఖరీఫ్ సీజన్ లో పంటలు సాగు చేస్తున్న రైతులకు సాగునీరు అందించేందుకు మూడు మోటార్లను ఆన్ చేసి నీటిని విడుదల చేసినట్లు చెప్పారు. రైతులు సక్రమంగా నీటి వాటాను వినియోగించుకోవాలని, పంటలు కాపాడుకోవాలని, ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రైతులు కూడా ఒకరికొకరు తోడ్పడునందించుకుంటూ అన్ని పొలాలకు నీరు సరఫరా అయ్యేలా సహకరించుకోవాలని సూచించారు ..

ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోటేరు లక్ష్మీ ముత్తారెడ్డి, జడ్పిటిసి అమర్లపూడి కీర్తి సౌజన్య, మండల కన్వీనర్ ఆవుల రమేష్ బాబు, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షహనాజ్ బేగం, గ్రామ సర్పంచ్ జమ్ముల వరబాబు, గ్రామ పార్టీ కన్వీనర్ జమ్ముల శేషగిరిరావు, సొసైటీ చైర్మన్ జమ్ముల వెంకటేశ్వరరావు, దేవాలయ చైర్మన్ వల్లాపురి రామకోటేశ్వరరావు, ఎంపీటీసీ తోట నారాయణ, దొడ్డదేవరపాడు సర్పంచ్ చెండ్యాల రామకృష్ణ, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు ..


SAKSHITHA NEWS