SAKSHITHA NEWS

సాక్షిత : మహిళల్లో చిరునవ్వులు చిందేలా సీఎం వై.యస్.జగన్ మోహన్ రెడ్డి కృషి : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..*
కంచికచర్ల మండలంలో 14,670 మంది డ్వాక్రా మహిళలకు YSR ఆసరా ద్వారా నాలుగో విడత ద్వారా రూ.13.39 కోట్ల లబ్ది : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..
కంచికచర్ల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఏర్పాటుచేసిన మండల స్థాయి వైయస్ఆర్ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొని నాలుగో విడత ఆసరా మంజూరు చెక్కును డ్వాక్రా మహిళలకు అందజేశారు. ముందుగా మహిళలతో కలిసి సీఎం వైయస్ జగన్ చిత్రపటానికి పాలభిషేకం నిర్వహించారు ..


ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు మాట్లాడుతూ మహిళలు బాగుంటేనే రాష్ట్రం ముందడుగులో ఉంటుందని భావించి.. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మహిళా సాధికారతకు పెద్దపీట వేసారని తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం వైయస్సార్ ఆసరా అనే గొప్ప కార్యక్రమాన్ని పూర్తి చేశారని.. ఇప్పటికే నాలుగు విడతల్లో డ్వాక్రా మహిళల ఖాతాల్లో కోట్ల రూపాయలు జమ చేశారన్నారు. ఎక్కడ లంచాలు లేకుండా.. వివక్షకు చోటు లేకుండా.. వ్యత్యాసాలు లేకుండా.. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని చెప్పారు. డ్వాక్రా మహిళల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన కంచికచర్ల జగనన్న మహిళా మార్ట్ ఎంతో విజయవంతమైందని.. ఏపీలోనే నాలుగో స్థానంలో కంచికచర్ల మహిళ మార్ట్ నిలిచిందని.. ప్రతి డ్వాక్రా మహిళల నుండి రూ.200 రూపాయల పొదుపు చొప్పున రూ.30 లక్షలతో ఏర్పాటుచేసిన మార్ట్ ఇప్పటికే కోటి 50 లక్షల రూపాయల టర్నోవర్ తో.. 14 లక్షల రూపాయల ఆదాయంతో.. కొనసాగుతుందన్నారు.

మహిళలను వ్యాపారవేత్తలుగా, ఆర్థికంగా బలోపేతం చేసేలా.. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న అమ్మ ఒడి, చేయూత, ఆసరా, చేదోడు, ఇతర సంక్షేమ పథకాలను వినియోగించుకొని మహిళలు తమ కుటుంబాలను తీర్చిదిద్దుకోవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అక్కాచెల్లెమ్మలను పలు విధాలుగా మోసం చేశారని.. తెలుగుదేశం ప్రభుత్వంలో దోచుకో -పంచుకో -తినుకో.. విధానాన్ని అమలు చేస్తూ రాష్ట్రాన్ని బ్రష్టుపట్టించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే చంద్రబాబుకు మహిళలు బుద్ధి చెప్పి.. జగనన్నకు భారీ విజయాన్ని అందజేశారని వివరించారు ..

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు ..

WhatsApp Image 2024 02 10 at 2.51.21 PM

SAKSHITHA NEWS