MLA Dasari who distributed support pensions.
ఆసరా పింఛన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాసరి.
_
సాక్షిత : సుల్తానాబాద్ మండలం సుద్దాల (120),అల్లిపూర్ (84),రేగడి మద్దికుంట (155) గ్రామాలకు చెందిన 359 మంది లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్ కార్డులను శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి * స్వయంగా పంపిణీ చేశారు._
సుల్తానాబాద్ మండలం సుద్దాల, రేగడి మద్దికుంట,అల్లిపూర్ గ్రామాలలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించి, మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాసరి
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో 46లక్షల కుటుంబాలకు ఆసరా పింఛన్లు అందజేస్తున్నారని అన్నారు.
గత పాలకుల హయాంలో వృద్ధులకు పింఛన్లు 200 రూపాయలు మాత్రమే ఇచ్చే వారని, కానీ కేసీఆర్ సీఎం అయ్యాక పదింతలు పెంచి 2016 రూపాయలు ఇస్తున్నారని తెలిపారు.
బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఇంత భారీగా పింఛన్లు లేవని విమర్శించారు. అభివృద్ధిలో తెలంగాణను మేటిగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకునే నాయకుడు కేసీఆర్ గారని, అర్హులైన ప్రతి పేదవారికి పెన్షన్ తప్పక ఇస్తామన్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇప్పటి వరకు నమోదు చేసుకోని వారు కూడా దరఖాస్తు చేసుకుంటే పింఛన్ అందజేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో రైతు బంధు జిల్లా అధ్యక్షుడు అనంత రెడ్డి,ఎంపీపీ బాలాజీ రావు, జడ్పీటీసీ స్వరూప రాణి, AMC ఛైర్మెన్ బుర్ర శ్రీనివాస్,PACS ఛైర్మెన్ జూపల్లి సందీప్ రావు,మహిపాల్ రెడ్డి,AMC వైస్ ఛైర్మెన్ మహిపాల్ రెడ్డి, సర్పంచ్ లు అంజలీ దేవి, రవీందర్ రెడ్డి, వసంత-మోహన్ రెడ్డి, ఎంపీటీసీ లు నిర్మల-ఓదెలు, రాజమణి,ఉప సర్పంచ్ రాజు, వెంకటేష్,నాయకులు నిశాంత్ రెడ్డి,
గంగ ప్రసాద్, చంద్రయ్య, సదయ్య, నాగరాజు, గట్టు శ్రీనివాస్, నల్లగొండ స్వామి, శ్రీనివాస్, తిరుపతి, స్వామి, మల్లారెడ్డి, సయ్యద్ మీర్, బొంత భాస్కర్, మల్లేష్,బొంకూరి ఐలయ్య, శ్రీనివాసరావు, సంపత్, సదయ్య, శ్రీనివాస్, కిషన్ రావు, కిషన్ రెడ్డి,,MPDO, MPO,గ్రామ పాలక వర్గం,ప్రజలు,తెరాస ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు, నాయకులు, కార్యకర్తలు , ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
…………………..