కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే చిరుమర్తి
చిట్యాల (సాక్షిత ప్రతినిధి)
పేదల కళ్ళల్లో ఆనందం నింపడం కోసమే కంటి వెలుగు కార్యక్రమం అని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
శుక్రవారం గుండ్రాంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన రెండో విడత కంటి వెలుగు శిబిరాన్ని ఎమ్మేల్యే చిరుమర్తి లింగయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ముందు చూపుతో రాష్ట్రంలో ప్రజలందరికీ కంటి వెలుగు కార్యక్రమాన్ని మొదటి విడత ప్రారంభించి అనేకమందికి కంటి అద్దాలను అందించారని, తిరిగి రెండో విడత కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టారన్నారు. ప్రజలు ఎవరూ కంటి సమస్యలతో బాధపడవద్దనే లక్ష్యంతో కంటి పరీక్షలను నిర్వహించి అద్దాలతో పాటు మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నారని, అవసరమైన వారికి కంటి ఆపరేషన్లను సైతం చేయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎంపీపీ కొలను సునీత వెంకటేష్ గౌడ్, జెడ్పిటిసి సుంకరి ధనమ్మ యాదగిరి గౌడ్, సర్పంచ్ రత్నం పుష్ప నరసింహ, కో ఆప్షన్ సభ్యులు మోసిన్, వైద్యాధికారి యు.నర్సింహ, కంటి వెలుగు వైధ్యాధికారి లక్ష్మి ఉపసర్పంచ్ రాచకొండ శ్రీను, మాజీ సర్పంచ్ రాచకొండ కృష్ణయ్య, బిఆర్ఎస్ పార్టీ మండల మహిళా విభాగం అధ్యక్షురాలు చెరకుపల్లి శశిరేఖ మహేష్, నాయకులు శివశంకర్ గౌడ్, నమ్ముల అనిల్ తదితరులు పాల్గొన్నారు.