SAKSHITHA NEWS

సాక్షితతిరుపతి నగరం:
తిరుపతి రైల్వే స్టేషన్ టాక్సీ యూనియన్ డ్రైవర్లుతో బుధవారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న తిరుపతి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్ధి, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ మన పిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని ఉద్యోగాల కోసం బయటకు వెళ్లకుండా తిరుపతికి ఐటి కంపెనీలు తీసుకురావాలనేదే నా లక్ష్యమని, ఇందుకోసం ప్రణాళికలు కూడా సిద్ధం చేశామన్నారు. నాయకులు వస్తుంటారు, పోతుంటారు, కానీ పుట్టిన ఊరికి మంచి చేసినవారే చరిత్రలో నిలిచిపోతారని, నా ఆలోచనల కృషితో నిర్మించిన 20 మాస్టర్ ప్లాన్ రోడ్లు 100 ఏళ్ళు తిరుపతి నగరాన్ని ముందుకు తీసుకెళ్తాయని, ఈ రోడ్లతో పాటు 5 ఫ్రీ లెఫ్ట్ రోడ్లు, 7 స్లిప్వే రోడ్లు నిర్మించి ట్రాఫిక్ లేకుండా చేయగలిగామన్నారు.

భవిష్యత్తులో మరో 14 మాస్టర్ ప్లాన్ రోడ్లు నిర్మించి నగరాన్ని మరింతగా అభివృద్ధి చేసి మెట్రో నగరాలతో తిరుపతి పోటీపడేలా చేస్తామన్నారు. అదే కాకుండా తిరుపతిని నేరరహిత నగరంగా మార్చాలని 4000 సిసి కెమెరాలతో నిఘా నీడలో ఉంచి చిన్న అవాంఛనీయ ఘటనలు జరగకుండా చేస్తామని, తిరుపతిని పారిశుద్ధ్యం విషయంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలపడమే లక్ష్యంగా పనిచేస్తామని మాట ఇస్తున్నానని, రానున్న ఎన్నికలలో తనని తిరుపతి ఎమ్మెల్యేగా గెలిపించి ఆశీర్వదించాలని తిరుపతి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్ధి భూమన అభినయ్ రెడ్డి విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ, స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు ఎస్.కె.బాబు, కార్పొరేటర్ కోటూరు ఆంజినేయులు, ఉదయ్ వంశీ, టౌన్ బ్యాంక్ మాజీ చైర్మెన్ తొండమనాటి వెంకటేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 03 06 at 3.04.23 PM

SAKSHITHA NEWS