We are lucky to participate in Tirupati’s birthday celebrations: MLA Bhumana Karunakara Reddy
తిరుపతి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం మన అదృష్టం : ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి
సాక్షిత : తిరుపతి నగరం 893వ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం మనందరి అదృష్టమని తిరుపతి శాసనసభ్యులు, టిటిడి పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితులు భూమన కరుణాకర రెడ్డి అన్నారు.
తిరుపతి పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఎమ్మెల్యే భూమన, నగర మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్ రెడ్డి, ముద్రనారాయణ, నగర ప్రముఖులు శ్రీగోవింధరాజ స్వామి ఆలయం నుండి పెద్ద జీయంగార్, చిన్న జీయంగార్, అర్చకుల ఆశీస్సులు తీసుకొని నాలుగు మాడా వీధుల్లో గోవింధ నామాలు జపిస్తూ రామానుజుచార్యుల వారి చిత్ర పటాలతో ప్రదర్శనగా వెల్లడం జరిగింది.
ఈ సందర్భంగా భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ శ్రీ మహావిష్ణువే శ్రీవెంకటేశ్వర స్వామి అవతారంలో స్వయంభువుగా వెలిసిన మహా పుణ్యక్షేత్రమిదని, దైవసమానులైన సమతా మూర్తి శ్రీ రామానుజాచార్యులు 1130 ఫిబ్రవరి 24వ తేదీన శంకుస్థాపన చేసిన ఊరు తిరుపతిని, ప్రపంచంలో వ్యక్తులకు మాత్రమే జన్మదిన వేడుకలు జరుగుతాయని, అయితే ఓ ప్రాంతానికి జన్మదిన వేడుకలు జరగడమంటే ఒక్క తిరుపతికి మాత్రమేనని ఆయన వివరించారు. ఆ భగవంతుని అనుగ్రహం వల్లే తాను ఇలాంటి మహోన్నత కార్యక్రమాన్ని చేస్తున్నానని, ఇంత గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా తన పూర్వజన్మ సుకృతంగా భూమన ఉద్ఘాటించారు.
తిరుపతి ప్రాభవాన్ని కాపాడుకోవాలని భూమన పిలుపు నిచ్చారు. టీటీడీ, నగరపాలక సంస్థ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్.కె.బాబు,రామస్వామి వెంకటేశ్వర్లు,నరసింహాచారి,హనుమంత నాయక్, మునిరామిరెడ్డి,శేఖర్ రెడ్డి, పొన్నాల చంధ్ర, ఆంజినేయులు,నారాయణ,పొన్నాల చంధ్ర,అనీల్ కుమార్,వెంకటరెడ్డి,దొడ్డారెడ్డి శంకర్ రెడ్డి,దొడ్డారెడ్డి మునిశేఖర్ రెడ్డి,నీలం భాలాజీ,గోపి యాదవ్,మబ్బు నాధమునిరెడ్డి,జెల్లి తులసీ యాదవ్,భరణీ యాదవ్,ప్రసాద్ రాజు,చిన్నముని,జక్కా శరత్,అశోక్ రెడ్డి,జ్యోతిప్రకాష్,లవ్లీ వెంకటేష్,నాగిరెడ్డి,రాజేంధ్ర,బాలిశెట్టి కిశోర్,సురేష్,వెంకటేష్ రాయల్,డిష్ చంధ్ర, సోమశేఖర్ రెడ్డి,బసవ గీత,దూది కుమారి,ఆదిలక్ష్మి,శ్యామల,మధుబాలా,శ్రీ సిటీ రామచంధ్రారెడ్డి,రెడ్డివారి ప్రభాకర్ రెడ్డి,పెన్నా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారి పాదాల చెంత తిరుపతి 893వ పుట్టిన రోజు వేడుకలు శుక్రవారం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీవారి పూజా కైంకార్యాలను నిర్దేశించిన జగద్గురు శ్రీ రామానుజాచార్యులే స్వయంగా శంకుస్థాపన చేసిన ఒక నాటి బ్రాహ్మణ అగ్రహారమైన నేటి తిరుపతి పరపతి మరింత ఎత్తుకు పెరిగేలా ఎమ్మెల్యే,టీటీడీ పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితులు భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో ఈ పండగ కొనసాగింది.
తిరుపతి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తొలుత శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో భూమన కరుణాకర రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, పట్టు వస్త్రాలను ఊరేగింపుగా తీసుకొచ్చి శ్రీగోవిందరాజు స్వామి ఆలయంలో సమర్పించారు. శ్రీ గోవిందరాజస్వామి ఆలయం వద్ద అర్చకులు, జియ్యర్ స్వాముల ఆశీస్సులు తీసుకుని వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాలు, భజన మండళ్ళ కళా ప్రదర్శనల నడుమ ఆధ్యాత్మిక యాత్ర శోభాయమానంగా జరిగింది. టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కళాకారులు నిర్వహించిన చెక్క భజనలు,కోలాటాలు,కళా ప్రదర్శనలు ఆధ్యాంతం ఆకట్టుకున్నాయి.
స్వామివారి భక్తులు పౌరాణిక వేషధారణలో పాల్గొని తమ భక్తి ప్రపత్తులు ప్రదర్శించారు. కనుల పండగలా కొనసాగిన భక్తి యాత్ర ఆద్యంతం గోవింద నామ స్మరణలతో తిరుపతి పులకించిపోయింది. అడుగడుగునా భక్తులు పచ్చ తోరణాలు కట్టి, పుష్పాలు, పసుపు నీళ్లు గుమ్మరిస్తూ,గుమ్మడి కాయలతో దిష్టి తీస్తూ కర్పూర హారతులు పడుతూ తమ భక్తిని చాటుకున్నారు. జగద్గురు శ్రీ రామానుజాచార్యుల చిత్రపటాలను ప్రదర్శిస్తూ తిరుపతి ప్రజలు సమతా స్ఫూర్తి ప్రచారకర్తలై ముందుకు సాగారు.