MLA Bhumana is a priority for the health of the poor in Arogyasri
ఆరోగ్యశ్రీలో పేదల ఆరోగ్యానికి పెద్దపీట – ఎమ్మెల్యే భూమన
తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ఉద్యోగి దేవిక కుమారుడు హేమకిరణ్ (3) గొంతు ఆపరేషన్ కోసం 3లక్షల రూపాయాల సీఎం రిలీఫ్ ఫండును తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి శుక్రవారం పద్మావతిపురంలోని తన నివాసంలో బాలుడి తల్లిదండ్రులకు అందజేశారు.
రాష్ట్రంలోని నిరుపేదలకు సైతం ఉన్నత వైద్యాన్ని అందించాలన్న ఆలోచనతో ఆరోగ్యశ్రీలో వందల రకాల జబ్బులను చేర్చి ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్న ఏకైక నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలందిస్తున్నారన్నారు.
అంతేకాకుండా ఇంటి వద్దకే డాక్టర్లు వచ్చి వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నారన్నారు. దాంతో పాటు ఎవ్వరికి అనారోగ్యమని తెలిసినా వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లక్షల డబ్బులను వారికి అందజేస్తున్న గొప్ప నాయకుడు జగనన్న అని అన్నారు. అందులో భాగంగానే తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా ఉన్న దేవికకు ఐదు మంది బిడ్డలు గర్భంలోనే చనిపోయి, చివరకు ఆరవ సారి పుట్టిన హేమకిరణ్ కు గొంతు సమస్య రావడంతో సీఎంసిలో వైద్యం చేయించి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అభ్యర్ధించడం జరిగిందన్నారు.