SAKSHITHA NEWS

WhatsApp Image 2023 07 18 at 5.36.46 PM

సచివాలయాలతో ప్రజలకు ఎన్నో మేళ్ళు – ఎమ్మెల్యే భూమన
ప్రజలకు సచివాలయ సేవలు సంతృప్తికరం – మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్


సాక్షితతిరుపతి : సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఎంతో మేళ్ళు జరుగుతున్నాయని, ముఖ్యంగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు సకాలంలో అందించడం, పెన్షన్లు మొదటి తేదీలోనే వయోవృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు అందించడం ద్వారా సచివాలయ సిబ్బంది ప్రజలతో మమేకం అయ్యారని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్ మాట్లాడుతూ సచివాలయ సేవలు ద్వారా ప్రజలు సంతృప్తులు అవుతున్నారని, సచివాలయ కార్యదర్శులు, వాలంటీర్లు ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలని పరిష్కరిస్తున్నారని తెలిపారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఏడో డివిజన్ ప్రాంతంలో మంగళవారం నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ రెడ్డి, ముద్ర నారాయణలు ప్రారంభించారు. ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే సచివాలయ ఉధ్యోగులను నియమించి, ప్రజల వద్దకే సేవలు అందేలా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నారని, మరింతగా ప్రజలకు సేవలు అందించాలనే లక్ష్యంతో వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి, ఇంటింటికి ప్రభుత్వ కార్యక్రమాలను అందిస్తున్న జగనన్నకు మనమంతా అండగా నిలవాలన్నారు. మేయర్ శిరీష, కమిషనర్ హరిత మాట్లాడుతూ 37.50 లక్షలతో నూతనంగా ఏడవ డివిజన్లో నిర్మించిన నూతన సచివాలయం ద్వారా సమీప ప్రాంతాల్లోని ప్రజలకు వేగంగా సేవలందించేందుకు భవనం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలు తమకు అవసరమైన సేవలు, పథకాలు పొందేందుకు సచివాలయాలను ఉపయోగించుకోవాలని కోరారు. నూతన సచివాలయ భవనానికి పూజలు నిర్వహించి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుపతి టౌన్ బ్యాంక్ చైర్మెన్ కేతం జయచంధ్రా రెడ్డి, కార్పొరేటర్లు కేతం జానకి, పుల్లూరు అమర సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మునిసిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, డిఈ సంజీవ్ కుమార్, 7వ డివిజన్ వెలెఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు చిమటా రమేష్, నాయకులు జ్యోతిప్రకాష్, తలారి రాజేంద్ర, శ్యామల, రఫి హింధూస్తాని తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS