SAKSHITHA NEWS

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే భగత్

నాగార్జునసాగర్ (సాక్షిత ప్రతినిధి)

నిడమానూరు మండలం, వెంకటాపురం గ్రామంలో పిఏసీఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని
ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో మన రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యపు ప్రతి గింజను కొనుగోలు చేస్తుందని అన్నారు.
కేంద్ర బీజేపీ ప్రభుత్వం రైతుల నుండి రైతు పండించిన ధాన్యాన్ని కొనము అని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని రైతు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని యాసంగి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని రైతులు దళారులకు తక్కువ ధరకు అమ్ముకుని నష్టపోకూడదని రైతులు తాలు,పొల్లు లేకుండా దాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే ప్రభుత్వ మద్దతు ధర ఇస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దలు, జిల్లా పిఎసిఎస్ డైరెక్టర్ విరిగినేని అంజయ్య, ఎంపీపీ బొల్లం జయమ్మ, మార్కెట్ చైర్మన్ జవాజి వెకటేశ్వర్లు, మండల అధ్యక్షులు సత్యపాల్,బొల్లం రవి, మార్కెట్ వైస్ చైర్మన్ మెరుగు రామలింగయ్య,జాల పాపయ్య, సర్పంచ్ కొండ జానయ్య,ఆనంద్,లకమల మధు,భాస్కర్,శంకరయ్య, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS