రాజకీయాలకు అతీతంగా జగనన్న పాలనలో సంక్షేమ పథకాలు
– 95వ రోజు కొమరోలులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నా రాంబాబు
-భారీ గజమాలతో స్వాగతించిన వైసీపీ నాయకులు, అభిమానులు
-ప్రజలను మభ్యపెడుతూ అబద్దపు ప్రచారాలు చేస్తున్న చంద్రబాబును నమ్మొద్దు
-వైసీపీ పాలనలో ప్రతి ఒక్క పేదవానికి ఇంటివద్దకే ప్రభుత్వ పథకాలు
వైసీపీని ఆశీర్వదించాలని కోరిన ఎమ్మెల్యే అన్నా
………………………………
రాజకీయాలకు,కుల,మతాలకు అతీతంగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మెహన్ రెడ్డి గారు పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని ఎమ్మెల్యే అన్నా రాంబాబు గారు అన్నారు. గురువారం కొమరోలు మండలంలోని కొమరోలు-2 సచివాలయ పరిధిలోని కొమరోలు టౌన్లో ఉదయం,సాయంత్రం బొంతపల్లి, తాతిరెడ్డి పల్లి గ్రామాల్లో నిర్వహించిన 95 వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నా రాంబాబు గారు పాల్గొన్నారు.ముందుగా వైసీపీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు, ఎమ్మెల్యే అన్నాను భారీ గజమాలతో సత్కరించి స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అన్నా ఆయా వీధుల్లోని ప్రతి గడప – గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని వివరించి మూడేళ్ళ పాలనలో అందించిన సంక్షేమ బుక్ లను మరియు జగనన్నే మా నమ్మకం కరపత్రాలను, అందించడం జరిగింది.అనంతరం ఆయా వీధుల్లో స్థానికంగా ఉన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకొని వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే అన్నా మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా జగనన్న ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలను అందచేస్తున్నారన్నారు.జగనన్న ప్రవేశ పెట్టిన అనేక రకాల సంక్షేమ పథకాలతో ప్రతి ఒక్కరూ లబ్ది పొందారన్నారు. కుల,మతాలు పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వారికీ వైసీపీ పాలనలో ఆర్థిక భరోసా కల్పించడం జరిగిందన్నారు.నవరత్నాలు పథకాలతో ప్రతి గడపలో ప్రజలు ఆనందంగా ఉన్నారన్నారు.ప్రజలను మభ్యపెడుతూ అబద్దపు ప్రచారాలు చేస్తు, అబద్దపు హామీలు ఇస్తున్న మాజీ ముఖ్య మంత్రి వర్యులు టీడీపీ అధినేత చంద్రబాబును నమ్మొద్దని ప్రజలకు వివరించారు. వైసీపీ హయాంలో ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనలో ప్రతి ఒక్క పేదవానికి ఇంటివద్దకే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయన్నారు. కావున రాబోయే రోజుల్లో వైసీపీని ఆశీర్వదించాలని ఎమ్మెల్యే అన్నా కోరారు. ఈసందర్బంగా కొమరోలులోని పాఠశాల విద్యార్థులతో ఎమ్మెల్యే అన్నా కాసేపు మాట్లాడి వారికి అందుతున్న సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు.ఈకార్యక్రమంలో వైసిపీ ముఖ్య నేతలు,జడ్పీటీసీలు, ఎంపీటీసీలు,సర్పంచ్ లు,కో -ఆప్షన్ సభ్యులు,వైసీపీ నాయకులు, కార్యకర్తలు,అధికారులు,సచివాలయ సిబ్బంది,గృహ సారదులు, వాలంటీర్లు పాల్గొన్నారు