మిషన్ కాకతీయ తో చెరువుల అభివృద్దా..? విధ్వంసమా..?
*చెరువులను కాపాడలేని కెసిఆర్ సర్కార్…
*
సాక్షిత మండలం కరీంనగర్ జిల్లా
- వెన్కెపల్లి చెరు వును పటిష్టపరచడానికి వెంటనే చర్యలు చేపట్టాలి.
- దెబ్బతిన్న రహదారులను వెంటనే పునరుద్ధరించాలి..
- పంట నష్టపోయిన రైతులకు పరిహార అందించాలి.. వెన్కేపల్లి చెరువు సందర్శనలో బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి వ్యాఖ్యలు ..
టిఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయతో చెరువుల అభివృద్ధి పనులు చేపడుతున్నామని , చెరువులను టిఆర్ఎస్ ప్రభుత్వం విధ్వంసం చేస్తుందని, చెరువుల అభివృద్ధి పనులు మున్నాళ్ళ ముచ్చటగానే మిగిలి కోతకు గురవుతున్నాయని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆరోపించారు.వె-సైదాపూర్ మండలం వెన్కెపల్లి తుమ్మల చెరువు తెగిన ప్రాంతాన్ని సోమవారం స్థానిక బిజెపి శ్రేణులతో కలిసి ఆయన సందర్శించి మాట్లాడారు.వెన్కెపల్లి తుమ్మల చెరువుపై దాదాపు 90 లక్షల నిధులతో చేపట్టిన మిషన్ కాకతీయ పనులు నామాత్రంగా చేపట్టడంతో నేడు చెరువు తెగిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. ఇక్కడి ప్రాంతంలో చెరువు మరమ్మత్తులను తూతు మంత్రం గానే లో కూడా చేపట్టారని , చెరువు పటిష్టత కోసం అధికారులు ప్రభుత్వం తగిన కార్యాచరణ చేపట్టకపోవడంతో నేడు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. వెన్కెపల్లి చెరువు తెగపోవడంతో సైదాపూర్ మండల కేంద్రానికి , అనేక గ్రామాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని, ముఖ్యంగా హుస్నాబాద్ హుజురాబాద్ ఆర్ అండ్ బి ప్రధాన రహదారులే కొట్టుకుపోయాయని తెలిపారు. చెరువు తీయడంతో దాదాపు 400 నుండి 500 ఎకరాల వ్యవసాయ భూముల కు నష్టంకలిగిందని, రైతుల పంట కూడా నీట మునిగిపోయిందని పేర్కొన్నారు. చెరువు పటిష్టత కోసం ప్రణాళికతో పనిచేయాల్సిన అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని, లోగడ బిజెపి ఆధ్వర్యంలో చెరువు మరమ్మత్తు, అభివృద్ధి పటిష్ట పనుల కోసం పలుమార్లు ఆందోళన చేసి విజ్ఞప్తులు చేసిన పట్టించుకున్న దాఖలాలు లేవని ఆయన విమర్శించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే వెన్కెపల్లి తుమ్మల చెరువు మరమ్మత్తు, పటిష్ట పనులు తక్షణం చేపట్టడానికి చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే చెరువు తెగిపోవడంతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి, దెబ్బతిన్న రహదారుల పై వెంటనే మరమ్మత్తు పనులు చేపట్టాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీలు, జంపాల సంతోష్, జేల్లా మల్లేష్, ప్రధాన కార్యదర్శులు కొలే చిరంజీవి, గాజుల రమేష్, మోర్చాల అధ్యక్షులు, నెల్లి శ్రీనివాస్, భరద్వాజ్, రవీందర్ రెడ్డి, అంతే మహేందర్ జిల్లా ఉపాధ్యక్షులు మాడ వెంకటరెడ్డి, సీనియర్ నాయకులు పల్లెని వేణుగోపాల్ రావు, నాయకులు కొండ మల్లయ్య, జితేందర్ రెడ్డి, కొలిపాక తిరుపతి, పొన్నం తిరుపతి, కత్తుల శ్రీనివాస్, నీర్ల, సతీష్, కిరణ్, రాజు, పైడాకుల శ్రీనివాస్, బండి రమేష్, సుదర్శన చారి, కొండల్ రెడ్డి, దొడ్డి శ్రీనివాస్, జిల్లా సుధాకర్, ఆవునూరీ తిరుపతి, మిస రాజయ్య, మునిపాల కుమార్, గుంటి సదయ్య, గుంటి శ్రీనివాస్, బొద్దుల రాయమల్లు, వెంగళ కుమార్, పబ్బాల మహేందర్,ఎలబొయిన తిరుపతి మండల సోషల్ మీడియా కన్వీనర్.కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు