సాక్షిత : శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన ముస్లిం సోదరులు ముస్లిం సమాజం కోసం మైనారిటీ ఫంక్షన్ హాల్ ను నిర్మించాలని మరియు పలు సమస్యలు మరియు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగినది…
ఈ సందర్భంగా మైనారిటీ సోదరులు మాట్లాడుతూ ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టినారు అని ,శేరిలింగంపల్లి నియోయోజకవర్గం ను అన్ని రంగాలలో అభివృద్ధి చేశారని కొనియాడారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నివసిస్తున్న ముస్లిం సమాజం కోసం మైనారిటీ ఫంక్షన్ హాల్ నిర్మించాలని ,పేద ,మధ్యతరగతి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని, అదేవిధంగా ముస్లిం స్మశాన వాటికి కొరకు అనువైన స్థలం కేటాయించాలని, అరులైన వారికి డబుల్ బెడ్ రూమ్ లు కేటాయిచాలని ముస్లిం సోదరులు ప్రభుత్వ విప్ గాంధీ ని వినతిపత్రం ద్వారా కోరడం జరిగినది.
దీనికి సానుకూలంగా స్పందించిన ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ముస్లిం సమాజం బాగు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారు అని ,షాది ముబారక్, రంజాన్ బట్టల పంపిణీ కార్యక్రమం ,మైనార్టీ పాఠశాలలు నెలకొల్పి నాణ్యమైన ఉచిత విద్యను అందించడం జరుగుతుంది అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు. అదేవిధంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీ ఫంక్షన్ హాల్ ను త్వరలోనే సకల హంగులతో ,అన్ని రకాల వసతుల తో ఏర్పాటు చేస్తామని , మైనారిటీ ఫంక్షన్ హాల్ ఏర్పాటుకు నా వంతు కృషి ,సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు. మన నియోజకవర్గంలో మరో 3 మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ లను త్వలోనే మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ముస్లిం స్మశాన వాటికలను ఏర్పాటు చేసి వాటిని అభివృద్ధి చేస్తామని,నిధులు మంజూరు కాగానే పనులు చేపట్టి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని, అన్ని రకాల మౌళిక వసతులు కలిపిస్తామని, మీకు ఎల్లవేళలో అందుబాటులో ఉంటానని, ఏ చిన్న సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో అబీబ్ బాయ్, మహమ్మద్ బేగ్, అక్తర్, ఖాసీం, అష్రాఫ్ , తహిర్, అక్బర్ , జమీర్,కాజా, గఫుర్, సబీర్,జాంగీర్ , నవాజ్, కాదర్, ఫక్రుద్దీన్,అలీ, మరియు ముస్లిం పెద్దలు తదితరులు పాల్గొన్నారు