సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని HMT హిల్స్ కాలనీ లో మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ (MoYAS) మరియు తెలంగాణ ప్రభుత్వం కలసి నేషనల్ సర్వీస్ స్కీం (NSS) వారి ఆధ్వర్యంలో క్లీన్ ఇండియా కాంపైన్ 2.0 కార్యక్రమంలో భాగంగా నేషనల్ సర్వీస్ స్కీం వాలంటీర్స్ తో కలసి పాల్గొన్న కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు .
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని HMT హిల్స్ కాలనీ లో, క్లీన్ ఇండియా 2.0, october 1st నుండి 31st వరకు జరిగే కార్యక్రమంలో 14000 మంది వాలంటీర్స్ 28000 కేజీల చెత్త ను సేకరించాలని టార్గెట్ లో భాగంగా, ఈ రోజు కార్యక్రమంలో, హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని రిషి ఉమెన్స్ ఇంజనీరింగ్ అండ్ డిగ్రీ కళాశాల నుంచి 50 మంది నేషనల్ సర్వీస్ స్కీం (NSS) వాలంటీర్స్ కలసి మొత్తం 367 కేజీల చెత్త సేకరించడం జరిగింది అని, అలానే వాలంటీర్లకు ప్రభుత్వం తరపున సర్టిఫికేట్లు అందించామని, నార్నె శ్రీనివాసరావు చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర ఆఫీసర్ ఐశ్శయ్య హరి, రిషి ఉమెన్స్ ఇంజనీరింగ్ అండ్ డిగ్రీ కాలేజ్ సిబ్బంది JNTU యూనివర్సిటీ నేషనల్ సర్వీస్ స్కీం (NSS) కోఆర్డినేటర్ శోభ రాణి, రిషి కాలేజ్ నేషనల్ సర్వీస్ స్కీం (NSS) ప్రవీణ, అనీషా, జ్యోతి, సత్యం, డివిజన్ వాసులు గోపీచంద్, మూర్తి, కుమారస్వామి, రాజుసాగార్, కోటేశ్వరరావు, శివ తదితరులు పాల్గొన్నారు.