SAKSHITHA NEWS

Minister Talasani Yadav unfurled the national flag and received a salute from the police

తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను పురస్కరించుకొని శనివారం కలెక్టరేట్ లో రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమాభివృధి, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని యాదవ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు.

అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ భారత దేశానికి 1947 ఆగస్టు 15 న స్వాతంత్య్రం వచ్చినా హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో అంతర్భాగం కానీ పరిస్థితులలో ఉదృత స్థాయిలో ఉద్యమాలు జరిగాయని అందులో మన మెదక్ జిల్లా నుండి యోధులు పాల్గొన్నారని అన్నారు. మెదక్ పట్టణానికి చెందిన చోళ్ల లింగయ్య ఇంజనీరు ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొన్నారని, అలాగే వెల్దుర్తి మాణిక్య రావు తన రచనల ద్వారా ప్రజలలో చైతన్యం నింపారని అన్నారు.

తోలి ఆంధ్ర మహాసభలు ఉమ్మడి మెదక్ జిల్లా జోగిపేటలో జరిగాయి గుర్తు చేశారు. ఎందరో యోధుల త్యాగాల ఫలితంగా 1948 లో ఇదే రోజు హైదరాబాద్ సంస్థానం దేశంలో భాగస్వామ్యమైందని, ఆనాటి రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్య పరిపాలన సాగిస్తూ స్వేచ్చా వాయువులు పీల్చుకుంటున్నామని అన్నారు.


రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలే స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలను రాష్ట్రంలో 15 రోజుల పాటు ఘనంగా నిర్వహించారని, అదేవిధంగా తెలంగాణ సమైక్యతా స్ఫూర్తిని అందరికి చాటిచెప్పాలని ఈ నెల 16 నుండి 18 వరకు మూడు రోజుల పాటు తెలంగాణా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నారని అన్నారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన జూన్ 2, 2014 నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్నంగా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు రచించి అమలు పరుస్తూ రాష్ట్రాన్ని దేశంలో అన్ని రంగాలలో ముందుచుతున్నారని అన్నారు.

రైతుల సంక్షేమాన్ని కాంక్షించి రైతు బంధు, రైతు భీమా, ఉచిత విద్యుత్ వంటి పధకాలను అమలు చేయడమే గాక రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటలను ఆకర్షణీయమైన మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తూ ఆడుకుంటున్నదని . అదేవిధంగా సామాజిక భద్రతలో భాగంగా ఆసరా పింఛన్లు, కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్, కె.సి.ఆర్. కిట్, గొర్రెల పంపిణి, మత్స్యకారుల సంక్షేమానికి వివిధ కార్యక్రమాలు అమలు పరుస్తూ ఆర్థికంగా బలోపేతం చేస్తున్నాడని అన్నారు.


ముఖ్యంగా గిరిజనుల ( షెడ్యూల్డ్ తెగల ) అభివృద్ధికి విశేషంగా కృషిచేస్తూ తాండాలను గ్రామా పంచాయతీలుగా చేస్తూ అవసరమైన సి.సి.రోడ్లు, మురుగు కాలువలు నిర్మించడంతో పాటు విద్యుత్ సౌకర్యాలు కల్పిస్తున్నదని, మిషన్ భగీరథ నీరందిస్తున్నదని అన్నారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించాలనే ఉద్దేశ్యంతో సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలను రాష్ట్రవ్యాప్తంగా నెలకొల్పిందన్నారు. విదేశాలలో ఎస్.టి. విద్యార్థుల ఉన్నత చదువుల కోసం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి క్రింద 20 లక్షలు అందజేస్తున్నదని అన్నారు. జిల్లాలో 8 వసతి గృహాలు, 3 ఆశ్రమ పాఠశాలలు నిర్వహిస్తూ విద్యార్థులకు పుస్తకాలు,దుస్తులు, ఉపకార వేతనాలు అందజేస్తున్నామని అన్నారు. కులాంతర వివాహాలు చేసుకుంటున్న జంటలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని మంత్రి వివరించారు. సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ప్రతి సంవత్సరం అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు.


జిల్లాలో ట్రైకార్ ద్వారా వివిధ రంగాలలో యూనిట్ల స్థాపనకు 393 మంది గిరిజన లబ్దిదారులను ఎంపిక చేసి 3 కోట్ల 87 లక్షల ఆర్ధిక సహాయం అందించగా 333 యూనిట్లు గ్రౌండింగ్ అయ్యాయని, టి-ప్రైడ్ క్రింద మరో రెండు యూనిట్లు మంజూరు ఇచ్చామని మంత్రి వెల్లడించారు. అలాగే పరిశ్రమల శాఖ ద్వారా ఎస్.టి. అభ్యర్థులు 65 పరిశ్రమల నెలకొల్పనకు కోటి 93 లక్షల పెట్టుబడి రాయితీ అందించామన్నారు. గిరి వికాస్ పధకం క్రింద 141 లక్షలు అందించామన్నారు. జిల్లాలో 20,571 గిరిజనులకు ఆహార భద్రత కార్డులు అందించామన్నారు.

నరసాపు నియోజక వర్గంలోని 110 గిరిజన తాండాలలో 21 కోట్ల అవ్యయంతో సిమెం రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం చెపటంమని, రోడ్డు సౌకర్యం లేని గిరిజన గ్రామాలలో 5 కోట్ల 30 లక్షల వ్యయంతో రోడ్డు సౌకర్యం కల్పించామని మంత్రి తెలిపారు.21,550 మంది ఎస్.టి. రైతులకు రైతు బంధు క్రింద 17 కోట్ల 15 లక్షలు అందించడంతో పాటు చనిపోయిన 328 ఎస్.టి. రైతు కుటుంబాలకు 16 కోట్ల 40 లక్షల ఆర్ధిక సహాయం అందించడం జరిగిందని మంత్రి వివరించారు. మిషన్ భగీరథ క్రింద 17,497 నల్లా కనెక్షన్ ను ఇచ్చామని అన్నారు.


ఇలా రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి ఎన్ని కార్యక్రమాలు అమలు పరుస్తున్నదని , హైదరాబాద్ లోని బంజారా హిల్స్ ఆదివాసీల కోసం సేవాలాల్ బంజారా భావం, కొమురం భీం ఆదివాస్ భవన్ లను నిర్మించిందని నేడు ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభోత్సవం కానున్నాయని అన్నారు. తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ విషయమని మంత్రి అన్నారు.
అనంతరం పాఠశాల విద్యార్థిని, విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. వారికి మంత్రి జ్ఞాపికలు అందజేశారు.


ఈ కార్యక్రమంలో జిల్లా పరిషద్ చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, శాసన మండలి సభ్యు శేరి సుభాష్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, అదనపు ఎస్పీ బాలస్వామి, అదనపు కలెక్టర్లు ప్రతిమ సింగ్, రమేష్, జెడ్.పి . వైస్ చైర్ పర్సన్ లావణ్య రెడ్డి, మునిసిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, గ్రంధాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్, ఆర్.డి.ఓ. సాయి రామ్, జిల్లా గిప్ర్జన అభివృద్ధి అధికారి జెంలా నాయక్, డీఈఓ రమేష్, జిల్లా సైన్స్ అధికారి రాజి రెడ్డి, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS