సికింద్రాబాద్ సాక్షిత : తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసంలో రంజాన్ ఏర్పాట్లు,గిఫ్ట్ ప్యాక్ ల పంపిణీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే ఇఫ్తార్ విందు ఏర్పాట్లపై సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పలు మసీదు కమిటీ సభ్యులతో సమీక్షించిన మంత్రి తలసాని.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఇప్పటికే గిఫ్ట్ ప్యాక్ (తోఫా) పంపిణీ పూర్తయిందని చెప్పారు. ఇఫ్తార్ విందు ఏర్పాటు కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని,ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. రంజాన్ సందర్భంగా నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు,సాయంత్రం ఉపవాస దీక్ష అనంతరం ఇఫ్తార్ నిర్వహణ ను దృష్టిలో ఉంచుకొని మసీదుల పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా,నీటి సరఫరా లో ఎలాంటి అంతరాయం లేకుండా ఆయా శాఖల ఆధ్వర్యంలో జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం రంజాన్ ను ముస్లీమ్ లు ఎంతో సంతోషంగా జరుపుకొనే విధంగా ఏర్పాట్లు చేస్తుందని చెప్పారు. పేదలు సైతం పండుగను గొప్పగా జరుపుకోవాలనే ఆలోచనతో దుస్తులను (తోఫా) ను అందజేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, నాయకులు కొలన్ బాల్ రెడ్డి, గుర్రం పవన్ కుమార్ గౌడ్, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, అశోక్ యాదవ్,వెంకటేష్ రాజు, నాగులు,జయరాజ్,శ్రీహరి,శేఖర్,మసీదు కమిటీల ప్రతినిధుల ఫహీం,నోమాన్, రజాక్,ఖలీల్,అఖిల్,అబ్బాస్,పాజిల్ తదితరులు పాల్గొన్నారు