SAKSHITHA NEWS

Minister Sridhar Babu's visit to Bhupalapally district

భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం మండల కేంద్ర మైన తాడిచెర్లతో పాటు పలు గ్రామాల్లో రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పర్యటించనున్నట్లుగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు తాడిచేర్లలో గ్రామ దేవతలు బొడ్రాయి, శ్రీదేవి, భూదేవి, పోచమ్మ, పోతురాజుల విగ్రహ పునం ప్రతిష్టాపన చేసి సంవత్సరం గడిచిన సందర్భంగా గ్రామ దేవతల మారు కొలుపు కునకు ముఖ్య అతితిగా విచ్చేస్తున్నట్లుగా తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని మండ లంలోని వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్య కర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు…


SAKSHITHA NEWS