గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు గురుకుల ఉపాధ్యాయుల(సీఆర్టీ)తో మంత్రి సీతక్క చర్చలు సఫలం కావడంతో 16 రోజులుగా సమ్మె చేస్తున్న వారు సమ్మె విరమించినట్టు ప్రకటించారు. విధుల్లో చేరుతున్నట్లుగా పేర్కొన్నారు. ఉద్యోగ క్రమబద్ధీకరణ, మినిమం టైం ేస్కల్ మినహా ఇతర అన్ని డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో సమ్మె విరమించేందుకు సీఆర్టీలు అంగీకరించారు.ప్రతి నెలా 5వ తేదీలోపు వేతనాలు, మహిళా టీచర్లకు 180 రోజుల ప్రసూతి సెలవులు, మరణ ప్రయోజనాలు మంజూరు చేస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చినట్టు కాంట్రాక్టు గురుకుల ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు మాలోతు సోమేశ్వర్ తెలిపారు. ఉద్యోగ క్రమబద్ధీకరణ, మినిమం టైం ేస్కల్ డిమాండ్లపై సీఎంతో చర్చించేందుకు మరోసారి సమావేశానికి మంత్రి సీతక్క హామీ ఇచ్చినట్టు వివరించారు
(సీఆర్టీ)తో మంత్రి సీతక్క చర్చలు సఫలం
Related Posts
తొర్రూరు సిఐ జగదీష్ అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు
SAKSHITHA NEWS తొర్రూరు సిఐ జగదీష్ అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు పిడిఎస్ అక్రమ రవాణా దారుడు నుంచి ఐదు లక్షల డబ్బులు డిమాండ్ చేయడంతో రెండు లక్షల తీసుకున్నారని ఆరోపణలపై తీసుకున్న ఏసీబీ అధికారులు SAKSHITHA NEWS
మిర్చి రైతు వినూత్న ఆలోచన.. పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
SAKSHITHA NEWS మిర్చి రైతు వినూత్న ఆలోచన.. పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే..! ఏపుగా పెరుగుతున్న పైరు పంటలపై ఇతరులు దృష్టి పడకుండా రైతులు వివిధ రకాల ప్లెక్సీలు ఏర్పాటు చేస్తుంటారు. దేవుళ్లు, సినీనటులు, జంతువులకు సంబంధించిన ఫొటోలను పెడుతుంటారు.…