SAKSHITHA NEWS

మంత్రి సీతక్క

ఆత్మ గౌరవం, హక్కులు, తమ ప్రాంతాల అభివృద్ధి కోసం ఆదివాసులు నేటికీ పోరాటాలు చేస్తూనే ఉన్నారు

5, 6 షెడ్యూల్ , స్పెషల్ స్టేటస్ , ఇతర మార్గాల ద్వారా ప్రత్యేక హక్కుల కల్పించబడ్డా నేటి ఆదివాసుల సమస్యలెన్నో

సమాజంలో అభివృద్ధి అనేది అన్ని వైపులా కాకుండా ఒకే వైపు జరుగుతుంది

కరోనా టైంలో నేను వెళ్లిన ఆదివాసుల ప్రాంతాలను చూసి కొంత మంది ఆశ్చర్య పడ్డారు

నా చిన్న తనం పోరాటాలు చేస్తూ పెరిగాను

సమస్యలను ఎన్నో అధిగమించి ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నాను

ఉద్యమాల ద్వారా ప్రజలను గౌరవించడం సమస్యల ప్రశ్నించడం నేర్చుకున్నా

జీవితంలో అడవే ఆధారంగా బతకడం నేర్చుకున్నాం

ఆది వాస బిడ్డగా నేను ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించాల్సిన అవసరముంది

అటవీ సంపదను వాడుకొని ఎదిగిన వారు ఆ ప్రాంత అభివృద్ధి ముందుకు రారు

కార్పొరేట్ కంపెనీలు విలేజ్ లను దత్త తీసుకొని అభివృద్ధి చేసుకోవాలి

అటవీ సంపద మీద ఆదివాసులకు నేటికి హక్కు పోగా, అణచివేత కొనసాగుతుంది

అడవులను తగ్గిస్తున్నారని ఆదివాసుల మీద కొంత మంది ఆరోపణలు చేస్తున్నారు

అడవిలోని కొంత సంపద మీద ఆధారపడే గారి మీద ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు

ఆదివాసులకు కోరుకునే విధంగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది

అధికారులు, ఆలోచనలు ఆదివాసుల అవసరాల మధ్య తేడాలున్నాయి

ప్రాంతాల వారీగా అభివృద్ధి ప్రణాళికలు ఉండాలి

పేదరికం నిర్మూలన కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది

మేధావులు , ప్రొఫెసర్లు ఆదివాసుల అభివృద్ధి మీద రిపోర్ట్స్ ఇవ్వాలి

కులాలకు, మతాలకు అతీతంగా మానవత్వంతో ప్రజలు నడుచుకోవాలి

యూనివర్సిటీ ఏర్పాటు చేసిన ఈ సెమినార్ లో మేధావులు , ప్రొఫెసర్లు పాల్గొన్నారు

ఆదివాస బిడ్డగా వెనుకబడిన , పేదరికంలో ఉన్న ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తా

ఆదివాస దినోత్సవం రోజు మేధావులు, ప్రొఫెసర్లు, విద్యార్థులు సెమినార్ పాల్గొనడం సంతోషం

అందరూ ప్రభుత్వానికి ఆదివాస ప్రాంతాల అభివృద్ధి కి సంబంధించి సూచనలు ఇవ్వాలి

మీరిచ్చే సూచనలను సలహాలను సీ ఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్తా

WhatsApp Image 2024 08 08 at 17.17.26

SAKSHITHA NEWS