నెల రోజులపాటు పవిత్ర రంజాన్ మాస ఉపవాస దీక్షలు చేపట్టి రేపు రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పర్వదినం జరుపుకోబోతున్న ముస్లిం సోదర సోదరీమణులకు
రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ఈద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లిం మైనారిటీల సంక్షేమనికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేశారని స్పష్టం చేశారు. ముస్లింల సర్వతోముఖాభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో నిబద్ధతతో పనిచేస్తోందని తెలిపారు. షాదీ ముబారక్ ద్వారా పేద ముస్లిం కుటుంబాల్లోని ఆడపిల్లలకు పెళ్లి ఖర్చు కోసం రూ.1,00,116 అందించడం జరుగుతుందని, మైనారిటీ యువతకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి, స్వయం ఉపాధి అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తోందని వెల్లడించారు.
ముస్లిం విద్యార్థులు విదేశాల్లో చదివేందుకు వీలుగా ప్రత్యేక ఉపకార వేతనాలు అందించడం జరుగుతుందని వివరించారు. సీఎం కేసీఆర్ పరిపాలనలో లౌకిక వాదం, మత సామరస్యం పరిరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.సీఎం కెసిఆర్ సారథ్యంలో రాష్ట్రంలో గంగా జమున తెహజీబ్ సంస్కృతి, సాంస్కృతిక వికాసం కొనసాగుతుందన్నారు. శాంతి, సౌశీల్న్యం, దయాగుణం చూపే అల్లా బోధనలు అందరూ అనుసరించాలని, ఈ పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వం అందించిన రంజాన్ తోఫాలతో ప్రతి కుటుంబం ఆనందంతో పండగ నిర్వహించుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.