
సాక్షితనగరి : రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల మరియు యువజన సర్వీసుల క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా మధ్యాహ్నం నగరి రూరల్ మండలం ఎంపీపీ భార్గవి భాస్కర్ ఆహ్వానం మేరకు అడవికొత్తూరు సొంత గ్రామం నందు వైభవంగా నిర్వహిస్తున్న గంగమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శనం చేసుకొన్నారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు మంత్రి ని గజమాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో నగరి నియోజకవర్గ ఎంపీపీలు వైస్ ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచ్లు ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
