SAKSHITHA NEWS

Minister Puvwada who sent the sewing machines

కుట్టు మెషీన్ లు పంపిణి చేసిన మంత్రి పువ్వాడ.

శిక్షణ పొందిన 41 మందికి ఉచితంగా కుట్టు మెషీన్ల పంపిణీ.

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. సోమవారం ఖమ్మం జిల్లా కేంద్రం సుగ్గలవారి తోట నందు మహిళలకు జన శిక్షన్ సంస్తాన్ వారి అధ్వర్యంలో తరుపున ఉచితంగా శిక్షణ ఇచ్చి 41 మంది మహిళలకు ఎన్నారై ఫౌండేషన్ మరియు శ్రీ మిత్ర ఫౌండేషన్ అధ్వర్యంలో సమకూర్చిన కుట్టు మెషీన్ లను మంత్రి పువ్వాడ చేతుల మీదగా పంపిణీ చేశారు. స్వయం ఉపాధి టైలరింగ్‌లో శిక్షణ పొందిన కుట్టు మిషన్‌, ధృవీకరణ పత్రాలను పంపిణీ చేశారు.


ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. ఇంట్లోనే మహిళలకు ఉపాధి కల్పించేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మహిళలు ఆర్ధికాభివృద్ధి సాధించాలంటే ముందు వారికి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కుటుంబంలో భర్తకు చేదోడు వాదోడుగా ఉండేందుకు టైలరింగ్ మంచి ఉపాధి అని అన్నారు. కేవలం శిక్షణ ఇచ్చి, సర్టిఫికేట్ ఇవ్వడం కాకుండా వారి కల ను సాకారం చేసేందుకు ముందుకొచ్చి కుట్టు మెషీన్లను ఇచ్చేందుకు ముందుకొచ్చిన ఎన్నారై ఫౌండేషన, మిత్ర ఫౌండేషన్ లను మంత్రి పువ్వాడ అభినందించారు.


కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, కార్పొరేటర్ మందడపు లక్ష్మీ, మక్బూల్, ప్రవీణ్, నాగేశ్వర రావు, పునుకొల్లు రాంబ్రహ్మం తదితరులు ఉన్నారు.


SAKSHITHA NEWS