రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా మస్జీద్ లో మంత్రి పువ్వాడ ప్రత్యేక ప్రార్థనలు
లైబ్రరీ చైర్మన్ ఆశ్రిఫ్ ఆధ్వర్యంలో నిరుపేద ముస్లింలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
ముస్లిములు ఈద్-ఉల్-ఫితర్ పండగను నిర్వహించుకుని ఆనందంగా, సుఖసంతోషాలతో ఉండాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ఖమ్మం నగరం 57వ డివిజన్ రెహమాన్ నగర్ మజీద్ నందు మంత్రి పువ్వాడ పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ ఆచరించి, ఉపవాస దీక్షలు చేస్తున్న పేద ముస్లింలకు ఖమ్మం సిటీ సెంట్రల్ లైబ్రరీ చైర్మన్ ఆశ్రిఫ్ అధ్వర్యంలో నెల రోజులకు సరిపడ బియ్యం, నిత్యావసర సరుకులు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేతుల మీదగా పంపిణీ చేశారు.ఈ నేపథ్యంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆశ్రిఫ్ ను ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా సోదరులు ఎంతో నిష్టగా ఉపవాస దీక్షలు చేస్తారని అన్నారు. ఆ అల్లాహ్ దీవెనలు అందరిపై ఉండాలి అని మంత్రి పువ్వాడ ఆకాంక్షించారు.సీఎం కేసీఆర్ నాయకత్వం లో రాష్ట్రంలో మతాల మధ్య ఘర్షణలు లేకుండా స్నేహపూర్వకంగా కలిసిమెలిసి ఉండే సంస్కృతి ఉందని మంత్రి అజయ్ కుమార్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ విజయ్ కుమార్, పార్టీ నగర అధ్యక్షులు నాగరాజు,జిల్లా మైనారిటీ అధ్యక్షులు తాజుద్దీన్,డివిజన్ అధ్యక్షులు పరుశురాం,నగర మైనారిటీ అధ్యక్షులు శంషుద్దీన్,మౌసిన్,షారుక్, వలి తదితరులు పాల్గొన్నారు.