SAKSHITHA NEWS

జమ్ముకశ్మీర్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన జవాన్‌ పబ్బాల అనిల్ మృతిపట్ల మంత్రి కేటీఆర్ దిగ్భ్రాతితి వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌: జమ్ముకశ్మీర్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన జవాన్‌ పబ్బాల అనిల్ మృతిపట్ల మంత్రి కేటీఆర్ దిగ్భ్రాతితి వ్యక్తం చేశారు. ప్రమాదంలో యువ జవాన్‌ని కోల్పోవడం బాధాకరమని తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనిల్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు.

జమ్ముకశ్మీర్‌ కిస్త్వార్‌ జిల్లాలోని మార్వా అటవీ ప్రాంతంలో ముగ్గురు జవాన్లతో ప్రయాణిస్తున్న తేలికపాటి హెలికాప్టర్‌ ప్రమాదవశాత్తు నదిలో కూలిపోయింది. ఆ ముగ్గురిలో అనిల్‌ మృతి చెందగా ఇద్దరికి గాయాలైనట్టు తెలిసింది. మల్కాపూర్‌ గ్రామానికి చెందిన పబ్బాల లక్ష్మి-మల్లయ్యకు ముగ్గురు కొడుకులు. చిన్న కొడుకు అనిల్‌ 2011లో సైన్యంలో చేరి టెక్నికల్‌ విభాగంలో పనిచేస్తున్నారు. అనిల్‌కు భార్య సౌజన్య, కొడుకులు ఆయాన్‌, అరవ్‌ ఉన్నారు. అని మృతితో ఆయన కుటుంబంతోపాటు గ్రామంలో విషాదం నెలకొన్నది.


SAKSHITHA NEWS