Minister Harish Rao on behalf of the State Govt.
*సాక్షిత మెదక్/పాపన్నపేట : మహాశివరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఏడుపాయల్లో అత్యంత అట్టహాసంగా జరుగుతున్నాయని వైద్యఆరోగ్య, ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏడుపాయల వన దుర్గాభవాని మాతకు పట్టు వస్త్రాలు సమర్పించి జాతర ఉత్సవాలను ప్రారంభించారు.
ఆయన వెంట మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్లు ప్రతిమ సింగ్, రమేష్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి లు ఉన్నారు..
ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో ఆలయ చైర్మన్ సాతెల్లి-బాలాగౌడ్, ఈవో సార శ్రీనివాస్, పురోహితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏడుపాయల ఉత్సవాలు దినదిన అభివృద్ధి చెందుతున్నాయన్నారు..
ఉత్సవాలు ఘనంగా జరగడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తరుపున రెండు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అమ్మవారిని మొక్కినట్లు తెలిపారు.