రైతులు, చదువురాని వృద్ధులే వాళ్ళ టార్గెట్
గ్రామీణ ప్రజలకు అందుబాటులో బ్యాంకుల సేవలు విస్తరించాలని సంకల్పంతో పాలకులు మారుమూల పల్లెప్రజలకు అందుబాటులో ఆర్థిక లావాదేవీలు జరగాలని విస్తరించిన మినీ బ్యాంక్ ల మోసాలు మాత్రం భారీగానే ఉన్నాయపిస్తున్నాయి. ఇటీవలి ఘటనలుచూస్తే, మండలంలోని వావిలాల, విస్నూర్, చెన్నూరు ఒకటేమిటి అనేక గ్రామాలలో చదువు రాని వృద్ధులను రైతులే లక్ష్యంగా మోసాలకు దిగుతున్నారని పదులసార్లు ఫిర్యాదులు వచ్చిన బ్యాంకు అధికారులు మాత్రం పట్టనట్లు వ్యహరించే తీరు విస్మయం కలిగించడమే కాక పలు అనుమానాలకు తావిస్తున్నారు. తాజాగా మండలంలోని దర్దేపల్లి గ్రామంలో కొనకటి వెంకన్న అనే రైతు అదే గ్రామానికి చెందిన మినీ బ్యాంకు నిర్వాహకుడు రాసాల మధు నిర్వహిస్తున్న మినీ బాంకు వద్దకు ఈ నెల 2వ తేదీన బ్యాంకు బ్యాలన్స్ చూడమని అడిగాడు… అందుకు మదుకు రైతు వెంకన్న తన ఆధార్ కార్డు.మరియు బ్యాంకు పాసు బుక్ ఇచ్చాడు. వెలిముద్ర వేయమన్న బ్యాంకు నిర్వాహకుడు 2000 వేలు ఉన్నవి అని రైతుకు చెప్పాడు సదరు రైతు 2000 డ్రా చేయమని చప్పగా బ్యాంకు నిర్వాహకుడు 2000 వేలు ఇచ్చి పంపించాడు.
రైతు తన తండ్రి కి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 5ఎకరాల లోపు రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసిన సంగతి గుర్తించి మరో రోజు మినీ బ్యాంకు వద్దకు వెళ్లి బ్యాలన్స్ చూలిపించుకోగా 600 రూపాయలు ఉన్నాయని చెప్పారు. దీనితో విస్తూపోయిన రైతు పాలకుర్తిలోని మెయిన్ బ్యాంకు కు వచ్చి వివరాలు అడుగగా నీ ఖాతాలో 20 000 వేల రూపాయలు మీరు ఈ నెల 2వ తేదీన తీసున్నట్లు వున్నారు.అని మేనేజర్ చెప్పగా రైతు బిక్క మొఖం తో జరిగిన విషయాన్ని బ్యాంకు అధికారులకు తెలుపగా వారు మినీ బ్యాంకు నిర్వహకుడితో మాట్లాడి మిగతా18000 వేల రూపాయలు ఇవ్వమని సుచించినట్లు రైతు వెంకన్న తెలిపాడు. అయిన మినీ బ్యాంకు నిర్వాహకుడు డబ్బులు ఎంతకు ఇవ్వకపోవడంతో ఈ నెల 22 తేదీన స్థానిక పోలీస్ స్టేషన్లలో పిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇప్పటికైన మినీ బ్యాంకుల నిర్వాహకుల మోసాలు అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.