SAKSHITHA NEWS

MEO Vidupu Srinivas taught the students

image 17

విద్యార్థులకు పాఠాలు బోధించిన ఎంఈఓ విడపు శ్రీనివాస్

మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల కొండపాక ను మంగళవారం మండల విద్యాధికారి విడపు శ్రీనివాస్ మన ఊరు – మనబడి కార్యక్రమాల పరిశీలనలో భాగంగా సందర్శించారు.”మన ఊరు – మన బడి” కార్యక్రమంలో భాగంగా పాఠశాలకు గ్రీన్ చాక్ పీస్ బోర్డ్స్, డ్యూయల్ డెస్క్ లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల కనీస అభ్యసన సామర్ధ్యాలను పరిశీలించారు. అనంతరం తెలుగు, గణితం,ఇంగ్లీష్ లపై విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించి, మెళుకువలను నేర్పించారు.మన ఊరు మనబడి కోసం ప్రభుత్వం మొదటి విడతగా 3,497 కోట్ల నిధులు విడుదల చేసి 26,065 స్కూళ్లలో డిజిటల్ విద్య, తాగునీరు,ఫర్నిచర్, ప్రహరీ,కిచెన్ షెడ్, మరుగుదొడ్లు, నవీనీకరణ వంటి 12 రకాల పనులను చేపట్టి పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు అన్వర్ పాషా, సిఆర్పి కొమురయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS