SAKSHITHA NEWS

స్థానిక ఎన్నికల్లో బిజెపి జెండా ఎగరవేయడం లక్ష్యంగా సభ్యత్వ నమోదు
బిజెపి రాష్ట్ర నాయకులు వేముల నరేందర్ రావు

………..

*సాక్షిత వనపర్తి :
తెలంగాణలో2029 స్థానిక ఎన్నికల్లో బిజెపి అత్యధిక స్థానాలను గెలుపొంది బిజెపి ప్రభుత్వ జెండాను ఎగరవేయడమే లక్ష్యంగా పార్టీ సభ్యత్వ నమోదు కు కార్యకర్తలు నాయకులు ఇప్పటినుండి కృషి చేస్తా ఉన్నారని బిజెపి రాష్ట్ర నాయకులు సభ్యత్వ నమోదు జిల్లా ఇన్చార్జ్ వేముల నరేంద్రరావు పేర్కొన్నారు బుధవారంజిల్లా కేంద్రంలోని లక్ష్మీ కృష్ణ గార్డెన్స్ లో వనపర్తి అసెంబ్లీ సభ్యత్వ సమన్వయకర్త మున్నూరు రవీందర్ అధ్యక్షతన నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.


ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన , వేముల నరేందర్రావు మాట్లాడుతూ దేశంలో ఏ ఇతర రాజకీయ పార్టీకి లేని కార్యకర్తల నిర్మాణాత్మక బలం బిజెపి సొంతమని కార్యకర్తల కృషి కారణం చేత గుజరాత్, మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ గోవా రాష్ట్రాల మాదిరి హర్యానాలో కూడా బిజెపి పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించిందని తెలంగాణ రాష్ట్రంలో గత పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి సాధించిన 77 లక్షల 45 వేల ఓట్లలో 75% మందిని బిజెపి సభ్యులుగా నమోదు చేయించి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ దుందుభి మోగించి 2029 ఎన్నికల్లో బీజేపీ అధికారం చేపట్టబోతుందని ధీమా వ్యక్తం చేశారు.


అనంతరంసభ్యత్వ నమోదు సమన్వయకర్త మున్నూరు రవీందర్,జిల్లా అధ్యక్షులు డి. నారాయణ లు మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు చురుగ్గా సాగుతుందని అసెంబ్లీ నియోజకవర్గానికి రాష్ట్ర పార్టీ నిర్దేశించిన 35వేల సభ్యత్వాలలో 15000 సభ్యత్వం పూర్తి అయిందని ఈనెల 15 వరకు లక్ష్యం పూర్తి చేయాలని 6 గ్యారంటీ ల పేరుతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీలో హామీల అమలులో పూర్తిగా విఫలం చెందిందని ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతామని ఈ నెల 15 వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తిచేసుకుని తదుపరి సంస్థ గత కమిటీల అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉద్యమ కార్యాచరణ తీసుకోవాల్సిన అవసరం ఉందని తద్వారా రాబోయే స్థానిక ఎన్నికల్లో బిజెపి జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సబ్బిరెడ్డి వెంకట్ రెడ్డి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ జిల్లా సభ్యత్వ కన్వీనర్ ఆర్.లోక్నాథ్ రెడ్డి ఓబిసి రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ ఓబీసీ మోర్ఛా రాష్ట్ర అధికార ప్రతినిధి బి. శ్రీశైలం యువమోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కదిరే మధు జిల్లా ఉపాధ్యక్షుడు బండారు కుమారస్వామి గౌని హేమారెడ్డి రామన్నగారి వెంకటేశ్వర్ రెడ్డి పి.విష్ణువర్ధన్ రెడ్డి
జిల్లా కార్యదర్శి బోయల రామ్మోహన్ జిల్లా అధికార ప్రతినిధి & మీడియా ఇన్ఛార్జ్ పెద్దిరాజు మహిళా మోర్ఛా మాజీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి కల్పన మోర్చాల జిల్లా అధ్యక్షులు రాఘవేందర్ గౌడ్,రాజశేఖర్ గౌడ్,రవి నాయక్,ఎండీ.ఖాలీల్ మహిళా మోర్ఛా జిల్లా ప్రధాన కార్యదర్శి సూగూరు లక్ష్మీ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి వెంకటరామిరెడ్డి ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు కృష్ణగౌడ్ మండల అధ్యక్షులు అజయ్ గౌడ్ బుచ్చిబాబు గౌడ్ కావాలి తిరుపతయ్య తిరుపతిరెడ్డి,విష్ణువర్ధన్ పట్టణ ప్రధాన కార్యదర్శులు సూగూరు రాము
మామీళ్ళపల్లి రాయన్న నవీన్ చారి వాకిటి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS