Mega Christmas celebrations organized under the leadership of Areka Pudi Gandhi
ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆరెక పూడి గాంధీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా క్రిస్మస్ వేడుకలు సందడిగా సాగిన మెగా క్రిస్మస్… *అతిధులు క్రిస్మస్ కేక్ కట్ చేశారు..
-శేరిలింగంపల్లి లో క్రిస్టియన్ భవన్ ఏర్పాటుకు ప్రభుత్వ విప్ గాంధీ హామీ
చందానగర్ డివిజన్ పరిధిలోని PJ R స్టేడియం లో ప్రభుత్వ విప్ ,శేరిలింగంపల్లి శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా క్రిస్మస్ వేడుకలలో ఎమ్మెల్సీ .రాజేశ్వర్ రావు , కార్పొరేటర్లు శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి , శ్రీమతిరోజా దేవి రంగా రావు నార్నే శ్రీనివాస రావు , శ్రీఉప్పలపాటి శ్రీకాంత్ , తో కలిసి పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ
.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని.రాష్ట్రంలో అతి పెద్ద నియోజకవర్గం శేరిలింగంపల్లిలో నివసిస్తున్న క్రిస్టియన్ల కోసం ప్రత్యేకంగా క్రిస్టియన్ భవన్ నిర్మాణానికి తనవంతు కృషి చేస్తానని, ప్రభుత్వ విప్ గాంధీ హామీ ఇచ్చారు..నగరంలోని ఉప్పల్ భగాయత్ లో క్రిస్టియన్ భవన్ కు
రాష్ట్ర ప్రభుత్వం శంకుస్థాపన చేసిన రోజునే..శేరిలింగంపల్లిలో మెగా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం ఆనందదాయకమని ఎమ్మెల్సీ రాజేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు…
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు
క్రిస్టియన్ మైనారిటీలకు ఉపయోగపడేలా అన్ని రకాల ఆధునిక హంగులతో కమ్యూనిటీ హాళ్లు… మోడరన్ బరియల్ గ్రౌండ్స్ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామని ప్రభుత్వ విప్ గాంధీ వెల్లడించారు.
మెగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం అని, తెరాస ప్రభుత్వం ప్రతి ఒక్క మతాన్ని గౌరవిస్తూ పండుగలు ఘనంగా జరుపుకోవడానికి బట్టలను పంపిణీ చేయడం జరుగుతుంది అని, ముఖ్యమంత్రికేసీఆర్ అన్ని మతాలను సమానంగా చూస్తూ ప్రజా పాలన అందిస్తున్నారు అని,ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు .
అదేవిధంగా కరుణామయుడు యేసుక్రీస్తు జన్మదినం ను పురస్కరించుకుని ముందస్తుగా నిర్వహించే సెమీ క్రిస్టమస్ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం అని , ఎంతో పవిత్రంగా భావించే క్రిస్మస్ పండుగను ఆనందోత్సవాల తో భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ ముందస్తు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలియయచేసారు .
దేవుడు కృప ప్రతి ఒక్కరి పైన ఉండాలని క్రిస్టియన్ సోదరి , సోదరమణులందరికి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియచేసారు, అదేవిదంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల వారిని ఆదరిస్తూ అందరి అభిమానాలను చూరగొంటున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ ని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు .
అన్ని మతాల,అన్ని వర్గాల వారి పండగలకు ప్రధాన్యతనిస్తూ సోదరభావంతో ఐక్యమత్యానికి ప్రతీకగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని చెప్పారు, ప్రతి పేదవాడు పండుగ రోజు సంతోషంగా జరుపుకోవవాలని క్రిస్మస్ సోదర సోదరిమనులకు ముందస్తుగా కిస్టమస్ శుభకాంక్షలు
తెలియచేస్తునని క్రిస్మస్ పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని ,చాలా పవిత్రమైన పండుగ అని .పండుగ ను చక్కటి వాతావరణం లో శాంతి యుతంగా కుటుంబ సభ్యుల మధ్య ఆనందాయకంగా ,సంతోషకరంగా జరుపుకోవాలని పిలుపునివ్వడం జరిగినది.
అంతకు ముందుగా సువార్తికులు బిషప్ దీవెన్ కుమార్ క్రిస్మస్ సందేశాన్ని అందించారు.
ఉత్సవాల కమిటీ కన్వీనర్లు రెవరెండ్ ఎడ్వర్డ్ రోజ్ , రెవరెండ్ యేసుపాదం , డాక్టర్ మోహన్ బాబు, డాక్టర్ విప్పర్తి, రెవరెండ్ పీ. ఇజ్రాయేల్, కేఆర్డీవీ ప్రసాదరావు, టీఆర్ రాజు, విద్యా సాగర్ కొమ్ము, యేసు రాజు, స్వామి తో పాటు క్రిస్టియన్ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..
అంబరానంటిన సంబరాలు//
మెగా క్రిస్మస్ సంబరాలు భక్తి గీతాలు, డ్యాన్సులు, స్కిట్లతో అంబరాన్ని అంటాయి.
ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, తెరాస నాయకులు ,పాస్టర్లు , క్రైస్తవ సోదరులు ,సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు.