తిరుపతి తాగునీటి అవసరాల దృష్ట్యా నగర ఇరిగేషన్ అధికారుల సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి పాల్గొనడం జరిగింది.
సాక్షిత : తిరుపతిలో తాగునీటి కోసం తెలుగు గంగ రిజర్వాయర్ నుంచి పైపులైన్ ఏర్పాటు చేసి ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా చేశాం. అలాగే రానున్న రోజుల్లో పెరుగుతున్న జనాభా దృష్ట్యా తిరుమల, తిరుపతి ప్రజల తాగునీటి అవసరాల కోసం బాలాజీ రిజర్వాయర్ ఎంతో అవసరమని ఇరిగేషన్ అధికారులు తో సమీక్ష సమావేశం చేయడం జరిగింది. భవిష్యత్తులో ఈ బాలాజీ రిజర్వాయర్ కూడా పూర్తి చేసి నగర ప్రజలకు ఎలాంటి నీటి ఎద్దడి లేకుండా చేయాలని అడుగులు వేస్తునాము..అలాగే మాల్వాడి గుండం ప్రాజెక్ట్(70కోట్ల అంచనా విలువ) 07 టీఎంసీ నీటిని నిల్వ ఉంచడానికి ఇరిగేషన్ అధికారులు ప్రతిపాదనలు చెయ్యడం జరిగింది. దీనిని కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటాం…
రానున్న రోజుల్లో పెరుగుతున్న తిరుపతి అవసరాల దృష్ట్యా మీ అందరి సహాయం కావాలని కోరుకుంటున్నాను.