జిల్లా కలెక్టర్ రాజర్షి షా,డి ఆర్ డి ఓ శ్రీనివాస్
సాక్షిత మెదక్ ప్రతినిధి
మెదక్ జిల్లాలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సెర్ప్ ద్వారా జిల్లాలో మహిళా సంఘాలకు, బ్యాంకు రుణాలను మంజూరు చేయడానికి గాను,మెదక్ జిల్లాకు ఆర్థిక సంవత్సరం 2023-24 గాను సెర్ప్ నుండి 491.74 కోట్ల లక్ష్యానికి గాను జనవరి నాటికి 100% సాధించి జిల్లా రాష్ట్రంలో ముందంజలో ఉందనీ,మహిళా సంఘాల సభ్యులకు వివిధ వ్యాపారాల ను ప్రారంభించుట కు,అభివృద్ధి పరుచుటకు గాను సెర్ప్ నుండి 6521 లక్ష్యం నిర్దేశించగా జనవరి 30 నాటికి 100% పూర్తిచేసి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవడం జరిగింద న్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా,అదనపు కలెక్టర్ రమేష్, డి ఆర్ డి ఓ, శ్రీనివాస్,అడిషనల్ డిఆర్డిఓ,డిపిఎం,ఏపిఎం,సెర్ప్ సిబ్బందిని అభినందించడం జరిగింది.