SAKSHITHA NEWS

MD Khalid Hussain is sad to cancel the fellowship scholarship

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని పీహెచ్డీ . మరియు ఎంఫీల్ చదివే పేద ముస్లిం మైనార్టీ విద్యార్థుల మౌలానా ఆజాద్ ఫెలోషిప్ స్కాలర్షిప్.నూ.కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం . శోచనీయం మహమ్మద్ ఖాలీద్ హుస్సేన్ ,,,,
హుజురాబాద్. నియోజకవర్గం ముస్లిం మైనార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం .


ఈరోజు హుజరాబాద్ పట్టణంలో బీ ఆర్ ఎస్ వై జిల్లా ప్రధాన కార్యదర్శి @మాజీ ఏఎంసి డైరెక్టర్ మొహమ్మద్ @ 17వ వార్డు ఇంచార్జ్ ఖాలీద్ హుస్సేన్. మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ముస్లిం మైనార్టీ సమాజానికి అనగదొక్కే ప్రయత్నం గా బిజెపి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని పీహెచ్డీ మరియు ఎం ఫీల్ చదివే మైనార్టీ విద్యార్థుల మౌలానా నేషనల్ స్కాలర్షిప్ రద్దు చేసింది.

రద్దు చేయడం సోచనీయం దీనిని మళ్లీ కేంద్ర ప్రభుత్వం మళ్లీ పాత పద్ధతిలో కొనసాగించాలని పేద ముస్లిం మైనార్టీ విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం 2005 అప్పటి కేంద్ర ప్రభుత్వం మైనార్టీ స్థితిగతుల మీద ఒక హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసి సచార్ కమిటీ ద్వారా దేశం మొత్తం మైనార్టీ స్థితిగతుల మీద అధ్యయనం చెయ్యగా ముస్లిం మైనార్టీలు విద్యలో మరియు ఆర్థిక ఉపాధి పరంగా వెనుకబడి ఉన్నారని సంచార్ కమిటీ కేంద్రానికి నివేదిక అందజేయడం జరిగింది ఆ నివేదిక ప్రకారం అప్పటి కేంద్ర ప్రభుత్వం 15 సూత్రాల మైనార్టీ వెల్ఫేర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

అప్పటినుండి మైనార్టీలకు స్కాలర్షిప్ ఇవ్వాలని నిర్ణయించింది. అప్పటినుండి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఉన్న స్కాలర్షిప్లను పేద మైనార్టీ విద్యార్థులకు అందించి విద్యార్థులకు ఉన్నత స్థాయి చేరే దిశగా ప్రభుత్వాలు కృషి చేశాయి. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ స్కాలర్షిప్ ను రద్దు చేయడం చాలా బాధాకరం దీనివల్ల మైనార్టీ విద్యార్థులు చదువుకు దూరం అవుతారు ఆర్థికంగా వెనుకబడతారు. కావున కేంద్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.

లేనిపక్షంలో నియోజవర్గం ముస్లిం మైనార్టీలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 2వార్డు కౌన్సిలర్ యాదగిరి నాయక్. 2 వార్డ్ అధ్యక్షులు సర్వర్ . 17వ వార్డ్ అధ్యక్షులు షేక్ అహ్మద్. బాబా షోహెల్. తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS