ఎం.సి.సి.ని పకడ్బందీగా అమలుపర్చాలి.
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని అన్ని చెక్ పోస్ట్ లలో నిఘా పెంచాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ తెలిపారు. ఎఫ్. ఎస్. టి, అలాగే ఎస్ ఎస్ టి టీములు నిఘా ఉదృతం చేయాలన్నారు. వివిధ తనిఖిలలో స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం, వెండి ఇతర సామగ్రి ని కలెక్టరేట్ లోని స్ట్రాంగ్ రూమ్ లో భద్ర పరిచి స్వాధీనం చేసుకున్న వాటికి తప్పకుండా రసీదు అందజేయాలని కలెక్టర్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న నగదు రూ.15.65 లక్షల రూపాయలు, 690 లీటర్ల మద్యం తో పాటు 27 మంది పై కేసులు నమోదు చేశామని తెలిపారు. అలాగే 229 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకోవడం జరిగిందని వాటి విలువ రూ. 15.48 లక్షలు ఉంటుందని అలాగే రెడీ మేడ్ దుస్తులు విలువ రూ. 21.45 లక్షలు ఉంటుందని కలెక్టర్ తెలిపారు.పట్టుబడిన నగదు, బంగారం అలాగే ఇతర వస్తువులు సంబంధిత బాధితులు ఆధారాలు అందచేస్తే పరిశీలన తదుపరి అందచేస్తామని కలెక్టర్ ఈ సందర్బంగా తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app
SAKSHITHA NEWS
DOWNLOAD APP