సాక్షిత తిరుపతి నగరం:
ప్రజల నుండి వచ్చే సమస్యల పరిష్కారానికే అధిక ప్రాధాన్యత ఇచ్చి ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులనుద్దేశించి తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అదితి సింగ్ ఐఏఎస్ అన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్, అర్జీలు స్వీకరించే స్పందన కార్యక్రమంలో మేయర్, కమిషనర్ అర్జీలను స్వీకరించారు.
జరిగిన డయల్ యువర్ కమిషనర్ కు 17, స్పందనకు 18 సమస్యలపై పిర్యాధులు వచ్చినాయి. ముఖ్యమైన పిర్యాధుల్లో చంద్రశేఖర్ రెడ్డి కాలనీలో ఓక ఖాళీ స్థలంలో ఆవులును మేపుతూ, వాటి పేడను కాలువల్లోకి వదలడం వలన పాములు కూడా వస్తున్నాయని, సుందరయ్య నగర్ నాల్గవ క్రాస్ నందు డ్రైనేజ్ కొరకు రోడ్డును త్రవ్వేసి తరువాత సరిగా పూడ్చలేదని, ఎల్.ఎస్ నగర్లో కంకర వేసి వదిలేసారని, త్వరగా రోడ్డును పూర్తి చేయించాలని, లీలామహాల్ వద్ద డివైడర్లలో మొక్కలకు నీరు లేక ఎండిపోతున్నాయని, కేబి లే అవుట్ పార్క్ వద్ద టెంకాయల మండి వలన శబ్ధ కాలుష్యం అధికంగా వున్నదని అదేవిధంగా కొన్ని ఏరియాల్లో డ్రైనేజి సమస్యలపై వచ్చిన పిర్యాధులపై మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అదితి సింగ్ స్పందిస్తూ పిర్యాధులను త్వరగా పరిశీలించి పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ తిరుమాలిక మోహన్, మునిసిపల్ ఇంజనీర్లు వెంకట్రామిరెడ్డి, చంద్రశేఖర్, రెవెన్యూ అధికారి సేతుమాధవ్, వెటర్నరీ ఆఫిసర్ డాక్టర్ నాగేంద్ర రెడ్డి, డిప్యూటీ సిటీ ప్లానర్ శ్రీనివాసులు రెడ్డి, అడిషనల్ సిటీ ప్లానర్ బాలసుబ్రమణ్యం, పైర్ అధికారి శ్రీనివాసరావు, మేనేజర్ చిట్టిబాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app
SAKSHITHA NEWS
DOWNLOAD APP