SAKSHITHA NEWS

కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఖమ్మం నగర మేయర్,ఖమ్మం సుడా చైర్మన్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాలు మేరకు సోమవారం ఖమ్మం నగరంలోని 4 వ డివిజన్ పాండురంగాపురం బస్తి దవఖాన నందు ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ దొరేపల్లి శ్వేత, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార కలిసి కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు..


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలందరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం ఉచితంగా అందించే కళ్లద్దాలను పొందాలని కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దండా జ్యోతి రెడ్డి(అయ్యప్ప రెడ్డి), డి.ఎం.హెచ్.ఓ మాలతి, డివిజన్ నాయకులు జోగుపర్తి ప్రభాకర్, భిక్షం, చింతల రవి, ఎర్ర సుబ్బాచారి, సతీష్ గౌడ్, పీతర్, పెరిక నాగరాజు, రాములమ్మ, వలి, తంగెలపల్లి శ్రీను, వీరేష్, మల్లేష్, మాధవి మరియు డివిజన్ కార్యకర్తలు,కంటి వెలుగు వైద్య సిబ్బంది, అంగన్వాడి టీచర్లు, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS