SAKSHITHA NEWS


Master plan roads are the solution to traffic problems

ట్రాఫిక్ సమస్యలకు మాస్టర్ ప్లాన్ రోడ్లతోనే పరిష్కారం

కమిషనర్ అనుపమ
సాక్షిత : తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలకు ట్రాఫిక్ సమస్యలను తొలగించేందుకు మాష్టర్ ప్లాన్ రోడ్లను త్వరితగతిన పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ అనుపమ అంజలి అధికారులను ఆదేశించారు.


మాస్టర్ ప్లాన్ రోడ్డు పనుల పురోగతిని సోమవారం ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కొరకే మాష్టర్ ప్లాన్ రోడ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.


నగర పరిధిలో ఏర్పాటు చేస్తున్న 14 మాస్టర్ ప్లాన్ రోడ్ల వల్ల ప్రజలకు, వాహన చోదకులు పూర్తిగా ఇబ్బందులు తొలుగుతాయన్నారు.
మాస్టర్ ప్లాన్ రోడ్ల మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాలు వెంటనే తొలగించేలా చర్యలు చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.

పెండింగ్ ఉన్న టి.డి.ఆర్. బాండ్లు వెంటనే ఇవ్వాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. ఏదైనా నగరం అభివృద్ధి చెందాలంటే రోడ్ల కనెక్టివిటీ ఉంటేనే సాధ్యమన్నారు.
కమిషనర్ వెంట అదనపు కమిషనర్ సునీత, సూపరింటెండెంట్ ఇంజినీర్ మోహన్, డి.ఈ. సంజీవ కుమార్, ఏసిపి బాల సుబ్రమణ్యం, సర్వేయర్లు దేవేంద్ర, మురళీకృష్ణ, ప్లానింగ్, అమెనిటీ సెక్రటరీ లు ఉన్నారు.
,,,,,,,,,,,,,,


SAKSHITHA NEWS