SAKSHITHA NEWS


Mass migration to Sarvepalli district

సర్వేపల్లి వైకాపాలోకి భారీ వలసలు”

*సాక్షిత : *సర్వేపల్లి నియోజకవర్గం, మాజీ జెడ్పిటిసి సభ్యుడు, ప్రముఖ బీసీ నాయకుడు రాచాల రవికుమార్ యాదవ్ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో, వేలాదిగా తరలి వచ్చిన ప్రజల సమక్షంలో తెలుగుదేశం పార్టీని వీడి, వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది.

కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు , మాజీ నెల్లూరు కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ ఆనం విజయకుమార్ రెడ్డి , గూడూరు మాజీ మున్సిపల్ చైర్మన్, సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకులు శ్రీమతి కోడూరు కల్పలత , స్థానిక వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు హాజరయ్యారు.


SAKSHITHA NEWS