జోగులాంబ గద్వాల, దేశం కోసం ప్రాణాలర్పించి అమరులైన అమరవీరుల స్మృత్యర్థం ప్రతి సంవత్సరం జనవరి 30 న అమర వీరుల సంస్మరణ దినోత్సం సందర్బంగా 2 నిమిషాలు మౌనం పాటించిన జిల్లా కలెక్టర్ బి ఎం సంతోష్.
మంగళ వారం జిల్లా సమీకృత కార్యాలయ సమావేశం హాలు నందు జిల్లా అదికారులందరి తో కలిసి స్వాతంత్ర పోరాటంలో ప్రాణత్యాగం చేసిన అమరులను స్మరిస్తూ ప్రతి సంవత్సరం జనవరి 30 వ తేదీన గాంధీ వర్ధంతి సందర్బంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండు నిముషాలు మౌనం పాటించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ బారత స్వతంత్ర పోరాటం లో ఎందరో మహనీయులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి త్యాగం చేసి అమరులు గా నిలిచారని, వారి త్యాగాలను గుర్తిస్తూ బావి తరాలకు తెలియజేయడం మన బాద్యత అన్నారు. ఈ రోజు గాంధీ వర్దంతి సందర్బంగా అమరులను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్లు అపూర్వ్ చౌహన్, చీర్ల శ్రీనివాసులు,ఏ ఓ బద్రప్ప, కలెక్టరేట్ సిబ్బంది , జిల్లా అధికారులు వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.