SAKSHITHA NEWS

చందానగర్ డివిజన్ పరిధిలోని శ్రీదేవి థియేటర్ నుండి అమీన్ పూర్ వరకు చేపట్టబోయే రోడ్డు విస్తరణ లో భాగంగా కైలాష్ నగర్ వద్ద రూ.160 లక్షల రూపాయల తో నూతనంగా చేపట్టబోయే కల్వర్ట్ నిర్మాణం కై అడ్డకింగా ఉన్న మంజీర మంచినీటి పైప్ లైన్ షిఫ్టింగ్ (తరలింపు) కై చేపట్టవలసిన చర్యల పై GHMC అధికారులు మరియు జలమండలి అధికారులతో కలిసి పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం శ్రీదేవి థియేటర్ నుండి అమీన్ పూర్ వరకు చేపట్టబోయే రోడ్డు విస్తరణ లో భాగంగా కైలాష్ నగర్ వద్ద రూ.160 లక్షల రూపాయల తో నూతనంగా చేపట్టబోయే కల్వర్ట్ నిర్మాణం చేపట్టబోతున్నాం అని దానిలో భాగంగా అడ్డకింగా ఉన్న మంజీర మంచినీటి పైప్ లైన్ షిఫ్టింగ్ (తరలింపు) కై చేపట్టవలసిన చర్యల పై అధికారులతో కలిసి పరిశీలించడం జరిగినది అని , GHMC ఇంజనీరింగ్ అధికారులు మరియు జలమండలి అధికారులు సమన్వయం తో పనులు చేపట్టాలని, ప్రజా సౌకర్యార్థం ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తగు చర్యలు తీసుకువలని, మంచి నీటి సరఫరా లో ఎటువంటి ఇబ్బంది లేకుండా పైప్ లైన్ ను తరలింపు చర్యలను చేపట్టాలని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు.

పైప్ లైన్ తరలింపు సమయంలో అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని ,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడలని, త్వరితగతిన మంజీర పైప్ లైన్ తరలింపు చర్యలు చేపట్టాలని, తద్వారా కల్వర్ట్ నిర్మాణము పనులు చేపట్టడానికి వీలు అవుతుంది అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు. త్వరలోనే కల్వర్ట్ నిర్మాణం పనులు చేపడుతామని, ట్రాఫిక్ రహిత సమాజం కోసం ,సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో GHMC అధికారులు EE శ్రీకాంతిని, DE దుర్గ ప్రసాద్ AE సంతోష్ రెడ్డి మరియు జలమండలి అధికారులు GM రాజశేఖర్, DGM నాగప్రియ, మేనేజర్ సుబ్రహ్మణ్యం మరియు చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్బర్ ఖాన్, సందీప్ రెడ్డి, నరేందర్ బల్లా తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS