SAKSHITHA NEWS

బాణామతి వస్తుందనే నెపంతో ఇంటి నుంచి వెళ్లగొట్టిన కుమారుడు, కోడలు, మనమండ్లు.

వీధిన పడిన వృద్ధ దంపతులు

సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి: బాణామతి వస్తుందనే నెపంతో కుమారుడు, కోడలు, మనుమండ్లు ఇంటి నుంచి వెళ్లగొట్టిన వైనం ఆత్మకూర్ ఎస్ మండలం కందగట్ల గ్రామంలో చోటుచేసుకుంది. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రం ఆర్డీవో కార్యాలయం వద్ద బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అర్రూరు నరసయ్య, భార్య అర్రూరు అనసూర్య, కందగట్ల గ్రామంలో వేరే నివాసం ఉంటున్నప్పటికీ ఇంటిలో ఉండొద్దని గత రాత్రి గృహనిర్బంధం చేసి భౌతికంగా కొట్టి మంగళవారం రాత్రివెల్లగొట్టారని వృద్ద దంపతులు కన్నీరు మున్నీరై విలపించారు.

తనకు ఉన్న ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ని కూడా కుమారుడే సేద్యం చేసుకుంటున్నాడని గత మూడేళ్లుగా ఎలాంటి ధాన్యము భుక్తము ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పెద్దమనుషుల సమక్షంలో సీజన్ కి ఐదు వేల రూపాయలు, పుట్టెడు వడ్లు ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ ఇవ్వడం లేదని వాపోయారు. పైగా భౌతికంగా మానసికంగా క్షోభకు గురి చేస్తున్న కుమారుడు, కోడలు, మనుమండ్లపై, చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని ఆర్డీవో వేణుమాధవ్ కు వినతిపత్రం అందజేశారు .


SAKSHITHA NEWS