మహిళా దినోత్సవ వేడుకల సన్నాహక సమావేశం
మార్చి 6న, రాంలీలా మైదానంలో స్త్రీశక్తి పురస్కారాల ప్రధానోత్సవం : మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి
………………………………………
మానకొండూర్ నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం మాహాత్మానగర్ గ్రామంలోని రాంలీలా మైదానంలో 6న, అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నియోజకవర్గ స్థాయిలో ఘనంగా నిర్వహిన్నట్లు రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మెన్ మరియు మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ తెలిపారు
క్యాంపు కార్యాలయంలో ఈరోజు సాయంత్రం బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మెన్ శ్రీ.జీవి.రామకృష్ణారావు గారితో పాటు ప్రజాప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో సన్నాహక సమావేశం నిర్వహించి అనంతరం సభాస్థలిని పరిశీలించారు
ఈ సంధర్బంగా రసమయి మాట్లాడుతూ స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదని కొనియాడారు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంధర్బంగా సామాజిక సేవా, కళా విశిష్ట సేవలందించిన మానకొండూర్ నియోజకవర్గంలోని మహిళా మూర్తులకు స్త్రీ శక్తి పురస్కాలను ప్రధానం చేసి ఘనంగా సన్మానించడం జరుగుతుందన్నారు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ ఎమ్మెల్సీ శ్రీమతి కవిత, రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ హాజరవుతారని వివరించారు
అదే విధంగా టివి యాంకర్ ఉదయభాను, శివపార్వతి, తో పాటు ప్రముఖ సీరియల్ నటీమణులు హాజరు కానున్నారని, గొప్ప సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు
ఈ వేడుకలకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే రసమయి గారు పిలుపునిచ్చారు..