40 ఏళ్లలో జరగని అభివృద్ధి నాలుగేళ్లలో చేసి చూపించా: ఎమ్మెల్యే నంబూరు శంకరరావు
ఊటుకూరులో ’మన కోసం మన శంకరన్న‘ కార్యక్రమం
పెదకూరపాడు నియోజవకర్గంలో 40 ఏళ్లలో గత పాలకులు చేయలేని అభివృద్ధిని తాను నాలుగేళ్లలో చేసి చూపించానని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు అన్నారు. క్రోసూరు మండలం ఊటుకూరు గ్రామంలో మన కోసం మన శంకరన్న కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా ఊటుకూరులో పర్యటించిన సమయంలో తన దృష్టికి వచ్చిన సమస్యలు ఏ మేరకు పరిష్కారమయ్యాయో తెలుసుకున్నారు. దాదాపు 90 శాతానికి పైగా సమస్యలు పరిష్కారమైనట్టు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ.. ప్రజలు తన దృష్టికి తెచ్చిన సమస్యలు పరిష్కారమయ్యాయో లేదో తెలుసుకోవడానికి ప్రతి గ్రామానికి వెళ్తున్నానన్నారు. ఊటుకూరులో దాదాపు 90 శాతం సమస్యలు పరిష్కారమయ్యాయని.. మిగిలిన వాటిని నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. జగనన్న పాలనలో అభివృద్ధి జరగలేదన్న వారికి ఊటుకూరులో జరిగిన అభివృద్ధి చూపించాలని సూచించారు. ఊటుకూరులో రూ.14 కోట్లతో సంక్షేమ పథకాలు అందిస్తే.. రూ.6.82 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. 170 మందికి జగనన్న కాలనీల్లో ఇళ్లు ఇచ్చామని.. సుమారు 400 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామని తెలిపారు. ఊటుకూరులో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటర్ నిర్మించి.. అన్ని రకాల సేవలను ఇంటి ముందుకే తెచ్చామన్నారు. హెల్త సెంటర్ల ద్వారా 60 రకాల వైద్యపరీక్షలు ఉచితంగా నిర్వహించి.. అవసరమైన మందులు కూడా ఉచితంగా ఇస్తున్నామన్నారు. పాఠశాలల రూపురేఖలు మార్చి మౌలిక వసతులు కల్పించింది తమ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. గత పాలకులు రోడ్ల పట్టించుకోకపోతే.. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారన్నారు. నాలుగేళ్లలో మ ప్రభుత్వం నియోజకవర్గంలో అన్ని రోడ్లు బాగు చేసిందన్నారు. గత పాలకులు చేయలేని అమరావతి – బెల్లంకొండ డబుల్ రోడ్డును సాధ్యం చేసి చూపించామన్నారు. త్వరలోనే ఊటుకూరులో కూడా ఆ రోడ్డు పనులు జరుగుతాయన్నారు. ఇవన్నీ జగనన్న విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలు చేయలేదని.. ప్రజలు మేలు చేసిన తమ ప్రభుత్వం చేసిందని గుర్తు చేశారు. ప్రతిపక్షాలు కూడా ఈ విషయాన్ని గుర్తిస్తే బాగుంటుందన్నారు.